• Other News
  • Live TV
  • కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పక్కా రోడ్లు

    Reporter
    Journalist Chinna Telangana  |  May 4, 2026, 5:17 pm
    కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పక్కా రోడ్లు

    వార్త ప్రతిక :-మరిపెడ
    విప్ డాక్టర్ జాటోతు రామచంద్రనాయక్
    మహబూబాబాద్ జిల్లా మరిపెడ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రహదారులు కీలకమని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే పక్కా రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం లభించిందని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోతు రామచంద్రనాయక్ అన్నారు.మరిపెడ మండలం బాల్ని ధర్మారం గ్రామపంచాయతీ పరిధిలోని మాన్సింగ్ తండా నుంచి సీరోలు మండలం రేకుల తండా వరకు మంజూరైన ఐటీడీఏ నిధులు రూ. 1.46 కోట్లు రెండు కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ప్రజలకు సౌకర్యవంతమైన రోడ్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
    ఈ రోడ్డు నిర్మాణంతో మాన్సింగ్ తండా, రేకుల తండా ప్రాంత ప్రజలకు రాకపోకలు సులభమవుతాయని, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కూడా వేగవంతం అవుతుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా యువజన నాయకుడు నూకల అభినవ రెడ్డి, పానుగోటి రామ్లాల్, మాజీ ఎంపిటిసి గంధసిరి అంబరీష్, కాలం రవీందర్ రెడ్డి, అఫ్జల్, బండ మధు, నరేందర్, డాక్టర్ వెంకన్న, బండారు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow