చౌటుప్పల్, మే 04,(వార్త పత్రిక);చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని రెండవ వార్డులో నూతనంగా నిర్మించుకున్న ఇంద్రమ్మ ఇల్లు సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. లబ్ధిదారురాలు సుర్వి నవనీత ఆహ్వానం మేరకు చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య ముఖ్య అతిథిగా హాజరై, రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. పేదల సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఒకటో వార్డు కౌన్సిలర్ కొసనం రాకేష్ రెడ్డి, మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుర్వి నరసింహ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పబ్బు శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కార్యకర్తలు సరిపల్లి మారయ్య,నల్ల గణేష్, గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి మట్టపల్లి శ్రీశైలం,మారుపాక ప్రభాకర్ గౌడ్,సుర్వి నరేష్ గౌడ్, బొంగు గణేష్,దొనకొండ పాపయ్య, బొంగు లక్ష్మయ్య, ముద్దం రాజేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
TELANGANA NALGONDA
2వ వార్డులో వైభవంగా 'ఇంద్రమ్మ ఇల్లు' ప్రారంభం
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఏసీబీ అధికారులకు చిక్కిన పేట RDO రాంచందర్ నాయక్
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రసాయన శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎం.డి. ఖాజా ఆరిఫ్ కి, రసాయన శాస్త్రంలో పి.హెచ్.డి. పట్టా
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
దోస్త్ మిల్గయా పోరాట యోధునికి ములుగు జిల్లా స్వాగతం సుస్వాగతం పలుకుతోంది