• Other News
  • Live TV
  • జాతీయ పౌర సరఫరాల పతాక దుకాణం ప్రారంభం

    Reporter
    admin January 5, 2026, 5:59 pm
    జాతీయ పౌర సరఫరాల పతాక దుకాణం ప్రారంభం

    పేద ప్రజలకు నాణ్యమైన సన్న బియ్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం


    కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 294వ డివిజన్ బహదురుపల్లి పరిధిలోని పోచంపల్లి డబుల్ రూమ్ ప్రాంతంలో శ్రీహరి ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర జాతీయ పౌర సరఫరాల పతాక దుకాణాన్ని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.

    ఈ సందర్భంగా కొలన్ హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ, పేద ప్రజలకు నాణ్యమైన సన్న బియ్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి అర్హ కుటుంబానికి ఆహార భద్రత కార్డు అందించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ నిరంతరం పనిచేస్తోందని ఆయన తెలిపారు.

    ఈ కార్యక్రమంలో మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా గ్రంథాలయ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ బొంగునూరి ప్రభాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ రాము గౌడ్, మైసిగారి శ్రీనివాస్, కావలి గణేష్, యువజన సీనియర్ నాయకులు బొంగునూరి కిశోర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు జక్కుల మల్లేష్ యాదవ్, ముత్యం రెడ్డి, అకుల ప్రేమ్ కుమార్, సదానందం తదితరులు పాల్గొన్నారు. అలాగే డబుల్ రూమ్ నివాసితులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

    📰 e-Paper Clip
    Google News Follow