• Other News
  • Live TV
  • మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విస్తృతబందోబస్తు

    Reporter
    Journalist Chinna Telangana  |  February 2, 2026, 12:26 am
    మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విస్తృతబందోబస్తు

    రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి 6 వరకు యెల్లంపేట్, రావల్కోల్, రాజబొల్లారం తండా మున్సిపాలిటీ పరిధిలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు మేడ్చల్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు.

    ఇందులో భాగంగా మేడ్చల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, దుండిగల్ పోలీస్ సిబ్బంది, జోనల్ ఫోర్స్‌తో కలిసి రావల్కోల్ గ్రామ పరిధిలో వాహనాల తనిఖీలు, ఫుట్ ప్యాట్రోలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. అనుమానాస్పద కదలికలపై నిఘా ఉంచి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశామని పేర్కొన్నారు.

    ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు విజిబుల్ పోలిసింగ్ చేపట్టినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
    సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow