వార్తపత్రిక, కుత్బుల్లాపూర్ ఫిబ్రవరి 4:
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనర్హత కేసు విచారణ సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ కాంగ్రెస్ పార్టీపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పాలన ప్రజా వ్యతిరేక దిశలో సాగుతోందని, రాజ్యాంగ విలువలను పూర్తిగా తుంగలో తొక్కుతోందని ఆరోపించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “రాహుల్ గాంధీ ఢిల్లీలో రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని రాజ్యాంగాన్ని కాపాడతానని నీతులు చెబుతుంటాడు. కానీ తెలంగాణలో ఆయన పార్టీ ప్రభుత్వం మాత్రం రాజ్యాంగాన్ని కాలరాస్తూ వ్యవహరిస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అభివృద్ధి చేయడం మానేసి గోతులు తవ్వడమే తన పాలనగా మార్చుకున్నాడని అన్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ అసలు పాలన విధానం” అని మండిపడ్డారు. అడ్డగోలు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం, అబద్ధాల పునాదిపై అధికారాన్ని చేపట్టి రెండేళ్లు పూర్తవుతున్నా, ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కదాన్నైనా పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలు, బుల్డోజర్ రాజకీయాలు, దమనకాండలతో పాలన సాగిస్తోందని విమర్శించారు. రైతులు, యువత, మహిళలు, నిరుద్యోగులు అందరూ మోసపోయారని అన్నారు.
రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏమీ లేదని, ప్రజలకు చూపించేందుకు ఒక్క పని కూడా లేకపోవడంతో ఈసారి ఏ దేవుడిపై ఒట్టు వేసి ప్రజలను నమ్మిస్తారో చూడాలని అన్నారు. ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్ పాలన తీరును అర్థం చేసుకున్నారని అన్నారు.
పార్టీ ఫిరాయింపుల అంశంలో స్పీకర్ పూర్తిగా పక్షపాతంగా వ్యవహరిస్తూ ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తున్నారని కె.పి. వివేకానంద్ ఆరోపించారు. పార్టీ ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేలపై రాజ్యాంగపరంగా అనర్హత తప్పదని స్పష్టం చేశారు. ఈ విషయంలో న్యాయస్థానం తప్పకుండా న్యాయం చేస్తుందని, న్యాయవ్యవస్థపై తమకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు.
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ప్రజా తీర్పును అపహాస్యం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడటానికి బీఆర్ఎస్ పార్టీ న్యాయపరమైన పోరాటాన్ని కొనసాగిస్తుందని కె.పి. వివేకానంద్ స్పష్టం చేశారు.
TELANGANA MEDCHAL-MALKAJGIRI
రాహుల్ గాంధీ నీతులు రేవంత్ రెడ్డి గోతులుకాంగ్రెస్ పై ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ఫైర్
Trending Now:
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
రూ.15 లక్షల లంచం ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ ఎస్ఈ
నిజాంపేట్ డబుల్ బెడ్రూమ్స్ వద్ద డంపింగ్ యార్డ్ తొలగించాలి: సీపీఎం డిమాండ్
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కి సిట్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
బీఆర్ఎస్ దెబ్బకు రేవంత్‌రెడ్డి ఎన్నికలంటెనే వణుకుతున్నడు : హరీశ్‌రావు