• Other News
  • Live TV
  • సీఎం సహాయ నిధి పేదలకు వరం

    Reporter
    Journalist Chinna Telangana  |  March 8, 2026, 4:30 pm
    సీఎం సహాయ నిధి పేదలకు వరం

    వార్తాపత్రిక, కుత్బుల్లాపూర్, మార్చి 8: పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి అన్నారు.
    కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని 284వ డివిజన్ గణేష్ నగర్ కాలనీకి చెందిన బోలె సుబ్బారావు అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స ఖర్చులకు సరిపడా డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో స్థానిక మాజీ కార్పొరేటర్ కే.ఎం. గౌరీష్ ఆధ్వర్యంలో కాలనీవాసులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డిని సంప్రదించారు. వెంటనే స్పందించిన హన్మంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దృష్టికి విషయం తీసుకెళ్లి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా శస్త్రచికిత్స కోసం రూ.2 లక్షల 50 వేల రూపాయల ఆర్థిక సహాయం మంజూరు చేయించారు. ఆ నిధులకు సంబంధించిన మంజూరు పత్రాలను హన్మంత్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు అనారోగ్యంతో ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అందిస్తున్న ముఖ్యమంత్రి సహాయనిధిని అవసరమైన వారు వినియోగించుకోవాలని సూచించారు.
    ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు స్థానిక కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow