• Other News
  • Live TV
  • టిడబ్ల్యూజేఎఫ్ డైరీ ఆవిష్కరించిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద

    Reporter
    Journalist Chinna Telangana  |  March 13, 2026, 3:05 pm
    టిడబ్ల్యూజేఎఫ్ డైరీ ఆవిష్కరించిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద

    టిడబ్ల్యూజేఎఫ్ కుత్బుల్లాపూర్ నియోజక స్థాయి కమిటీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆవిష్కరించి అనంతరం వారు మాట్లాడుతూ.... నిత్యం జనం సమస్యలు సామాజిక సమస్య ఆర్థిక సమస్యలపైన వార్తలు రాసే జర్నలిస్టులు డైరీని తీసుకువచ్చి మరింత వన్నె తెచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టులకు అండగా ఉండు మీ సమస్యల్లో భాగమైతానని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం అక్రిడేషన్ కార్డులు హెల్త్ కార్డులు అందించింది నేటి ప్రభుత్వం జర్నలిస్టులను పట్టించుకోవడంలేదని తెలిపారు. అసెంబ్లీలో వీటిపై చర్చిస్తానన్నారు. చిన్న, మధ్య తరహా పత్రికలకు ప్రభుత్వ ప్రోత్సాహం లేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థ భారత న్యూస్ పేపర్స్ రిజిస్ట్రార్(RNI)/ భారత ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్(PRGI) అనుమతి పొంది, కొన్నేళ్లుగా అష్ట కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎంతోమంది సీనియర్ జర్నలిస్టులు నడుపుతున్న అన్ని తరహా పత్రికలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకుండా, ఎంపానల్మెంట్ చేయకుండా, కనీసం అక్రెడిటేషన్లు ఇవ్వకుండా అణచివేస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించిన ఈ స్థానిక పత్రికల జర్నలిస్టుల పట్ల పాలకుల వివక్ష పోవాలి. తక్షణమే అన్ని పత్రికలను గుర్తించాలని కోరారు. ఈకార్యక్రమంలో
    టిడబ్ల్యూజేఎఫ్ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డమీది అశోక్, జాతీయ కౌన్సిల్ సభ్యులు దామెర జగదీశ్వర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జెమిని నాగరాజు గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు, పి.శంకర్, టీడబ్ల్యూజేఎఫ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ స్థాయి వర్కింగ్ ప్రెసిడెంట్ శివకుమార్, ప్రధాన కార్యదర్శి అంగూరు గోవిందరావు, ప్రచార కార్యదర్శి సంజీవ్ కుమార్, ఉపాధ్యక్షులు మంజుల రెడ్డి, ఎం.సుస్మిత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow