• Other News
  • Live TV
  • ఇజ్రాయెల్‌లో 6008 మందికి గాయాలు.. నేవీ చీఫ్ మృతిని క‌న్ఫ‌ర్మ్ చేసిన ఇరాన్‌

    Reporter
    Journalist Chinna Telangana  |  March 30, 2026, 4:34 pm
    ఇజ్రాయెల్‌లో 6008 మందికి గాయాలు.. నేవీ చీఫ్ మృతిని క‌న్ఫ‌ర్మ్ చేసిన ఇరాన్‌

    జెరుస‌లాం: అమెరికా-ఇజ్రాయెల్(Israel) ద‌ళాలు చేప‌ట్టిన దాడుల‌కు ప్ర‌తీకారంగా ఇరాన్ కూడా ప్ర‌తిదాడికి దిగిన విష‌యం తెలిసిందే. ఫిబ్ర‌వ‌రి 28వ తేదీ నుంచి జ‌రిగిన ఇరాన్ దాడుల్లో సుమారు 6008 మంది గాయ‌ప‌డిన‌ట్లు ఇజ్రాయెల్ వెల్ల‌డించింది. ఇరాన్‌తో పాటు హిజ్‌బుల్లా చేసిన దాడుల వ‌ల్ల భారీ మొత్తంలో ఇజ్రాయిలీ ప్ర‌జ‌లు గాయ‌ప‌డిన‌ట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ స్ప‌ష్టం చేసింది. గ‌డిచిన 24 గంట‌ల్లో సుమారు 232 మందిని ఆస్ప‌త్రిలో చేర్పించిన‌ట్లు ఇజ్రాయెల్ ఆరోగ్య‌శాఖ పేర్కొన్న‌ది. అయితే గ‌త నాలుగు వారాల్లో మొత్తం 15 మంది మ‌ర‌ణించిన‌ట్లు ఇజ్రాయెల్ వెల్ల‌డించింది. ఈ స‌మాచారాన్ని ఆ దేశ అంబులెన్స్ స‌ర్వీసు పేర్కొన్న‌ది. మ‌రో వైపు ఇరాన్‌లో భారీ స్థాయిలో ప్రాణ న‌ష్టం జ‌రిగింది. ఇజ్రాయెల్‌-అమెరికా బ‌ల‌గాలు నిర్వ‌హిస్తున్న సైనిక ఆప‌రేష‌న్ వ‌ల్ల .. ఇరాన్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 1900 మంది మ‌ర‌ణించిన‌ట్లు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ రెడ్‌క్రాస్ పేర్కొన్న‌ది. మ‌రో 20 వేల మంది గాయ‌ప‌డిన‌ట్లు ఇరాన్ చెప్పింది.

    అమెరికా-ఇజ్రాయెల్ ద‌ళాలు జ‌రిపిన దాడిలో నేవీ చీఫ్ అలీరెజా తంగ్‌సిరి మృతిచెందిన‌ట్లు ఇస్లామిక్ రెవ‌ల్యూష‌న‌రీ గార్డ్ కార్ప్స్ ద్రువీక‌రించింది. త‌మ దేశంలో వీరులు మ‌ర‌ణిస్తున్నార‌ని, అయినా కానీ తాము అదే బ‌లంతో ముందుకు వెళ్ల‌నున్న‌ట్లు ఓ ప్ర‌క‌ట‌న‌లో ఇరాన్ తెలిపింది. వీరుడైన క‌మాండ‌ర్‌ను కోల్పోయినా.. త‌మ నావికులు మాత్రం హోర్ముజ్ జ‌ల‌సంధిలో శ‌త్రువుల‌ను చీల్చిచెండాడుతున్నార‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు. 2018 నుంచి ఇరాన్ నేవీకి తంగ‌సిరి చీఫ్‌గా ఉన్నారు. గ‌త గురువారం జ‌రిగిన దాడిలో అత‌ను ప్రాణాలు కోల్పోయారు.

    📰 e-Paper Clip
    Google News Follow