చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే మొత్తం 27 మంది అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ (Congress) పార్టీ శుక్రవారంనాడు విడుదల చేసింది. డీఎంకే కూటమిలో భాగంగా కాంగ్రెస్ మరోసారి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. శ్రీపెరుంబుదూరు నుంచి పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కె.సెల్వపెరుంతగై మరోసారి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లోనూ ఆయన శ్రీపెరుంబుదూరు నుంచి పోటీ చేసి ఏఐఏడీఎంకే అబ్యర్థి కె.పళనిపై 11,000 అధిక్యంతో గెలుపొందారు.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పొన్నేరి అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే దురై చంద్రశేఖర్ మరోసారి పొన్నేరి నుంచి పోటీ చేస్తున్నారు. కృష్ణగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి డాక్టర్ ఎ చెల్ల కుమార్ పోటీలో ఉండగా, వేలచ్చేరి నుంచి జేఎంహెచ్ ఆసాన్ మౌలానా, షోలింగూర్ నుంచి ఏఎం మునిరత్నం, ఉతంగారై అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆర్ కుప్పుస్వామి పోటీ చేస్తున్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మార్చి 30న ప్రారంభమైంది. ఏప్రిల్ 6వ తేదీతో నామినేషన్ల సమర్పణ గడువు ముగియనుంది. ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరుగనుండగా, మే 4న ఫలితాలు వెలువడతాయి.
NATIONAL
తమిళనాడు ఎన్నికలు.. 27 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
బంగ్లాదేశ్లో మరో దారుణం.. పూజలో ఉన్న హిందువులపై బాంబు దాడి
వీణా విద్వాంసురాలు శ్రీవాణిని కలిసిన న్యాయవాద దంపతులు
నిజాంపేట్ డబుల్ బెడ్రూమ్స్ వద్ద డంపింగ్ యార్డ్ తొలగించాలి: సీపీఎం డిమాండ్