• Other News
  • Live TV
  • ఆర్టీసీ బస్ స్టేషన్ లో చలివేంద్రం ప్రారంభం

    Reporter
    Journalist Chinna Telangana  |  May 2, 2026, 6:12 pm
    ఆర్టీసీ బస్ స్టేషన్ లో చలివేంద్రం ప్రారంభం

    చౌటుప్పల్, మే 02,(వార్త పత్రిక);చౌటుప్పల్ లోని ఆర్టీసీ బస్ స్టేషన్ లో స్థానిక బాలాజీ షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శనివారం ప్రముఖ వ్యాపారవేత్త బాలాజీ షాపింగ్ మాల్ యజమాని కృష్ణ రామ్ చౌదరి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా బస్ స్టేషన్ ప్రాంగణంలో వేసవి కాలంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రయాణికుల దప్పిక తీర్చేందుకు తాము ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేపడతామని తెలిపారు. వ్యాపారంతో పాటు తాము సమాజ సేవలోను ముందు ఉంటామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కంట్రోలర్లు బొప్పని ఆనందరావు, యాదయ్య, స్థానికులు కాసుల రఘు, ముత్యాల హనుమంత రెడ్డి, రాజేష్, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, ప్రయాణికులు, తదితరులు పాల్గొన్నారు

    📰 e-Paper Clip
    Google News Follow