వార్త ప్రతిక :-దంతాలపల్లి
అకాల వర్షానికి తడిసిన ధాన్యం పరిశీలించిన
తొర్రూరు డివిజన్ అధ్యక్షుడు.చిర్ర.యాకన్న
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పడమటి గూడెం స్టేజి వద్ద ఉన్నవడ్ల కొనుగోలు కేంద్రాన్ని.అఖిల భారత రైతు కూలీ.సంఘం తొర్రూరు డివిజన్ కమిటీ.ఆధ్వర్యంలో
పరిశీలించిన అనంతరం సంఘం.తొర్రూరు డివిజన్అధ్యక్షుడు.చిర్ర.యాకన్న.స్పందించారు.అకాల వర్షానికి తడిసిన ధాన్యం రైతు కళ్లముందే నష్టపోతుంటే ప్రభుత్వం చూస్తూ ఉండటం దారుణం. ‘రంగు మారింది’ అంటూ కొర్రీలు పెట్టడం అంటే రైతును బతికుండగానే శిక్షించడం లాంటిది. రైతు పండించిన ప్రతి గింజకు బాధ్యత ప్రభుత్వం తీసుకోకపోతే, ఈ ప్రభుత్వానికి రైతుల ముందు నిలబడే హక్కే లేదు అని ఆయన తీవ్రంగా విమర్శించారు.
ఒకపక్క ఎరువులు,పురుగుమందులు, విత్తనాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రైతు పెట్టుబడి రెట్టింపు అయింది. కానీ పంట వచ్చాక గిట్టుబాటు ధర లేదు, ఎంఎస్పీ కేవలం కాగితాల మీదే ఉంది. ఇది రైతాంగంపై నేరుగా జరుగుతున్నదోపిడీ.కాదా.అని.ప్రశ్నించారు.స్వామినాథన్ కమిషన్ చెప్పినట్టుగా ఖర్చుపై 50% లాభంతో మద్దతు ధర ఇవ్వాలని సంవత్సరాలుగా రైతులు అడుగుతున్నారు. కానీ ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధంగా లేదు. రైతు చావు మాత్రం కనిపించడంలేదా. అని మండిపడ్డారు.కొనుగోలు కేంద్రాలు ఇప్పటికీ పూర్తిగా ప్రారంభం కాలేదు. ప్రారంభమైన చోట్ల తూకాలు లేవు, గోనె సంచులు లేవు. ఇది ప్రభుత్వ యంత్రాంగం పనితీరా? రైతు పంటను భద్రపరచడంలో ముందుచూపు లేకపోవడం ఈ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం అని విమర్శించారు.ప్రజాపాలన అంటున్నార.రైతు గోడు వినని పాలన ప్రజాపాలన కాదు అది రైతు వ్యతిరేక పాలన. రైతు రక్తంతో నడిచే వ్యవసాయాన్ని ఇలా నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదుఅని స్పష్టం.చేశారు.డిమాండ్లు:తడిసిన ధాన్యాన్ని ఎలాంటి కొర్రీలు లేకుండా వెంటనే పూర్తిగా కొనుగోలు చేయాలి
అన్ని కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించి సదుపాయాలు కల్పించాలి
తూకాలు, గోనె సంచుల కొరతను వెంటనే తీర్చాలి.అన్ని పంటలకు గిట్టుబాటు ధరకు చట్టబద్ధ హామీ ఇవ్వాలి.స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను తక్షణమే అమలు చేయాలి.ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లుతెరచుకుని రైతులను ఆదుకోకపోతే, గ్రామాల నుంచి రోడ్లపైకి వచ్చి పోరాటం చేస్తాం. కొనుగోలు కేంద్రాల ముందు నుంచే ఉద్యమాన్ని ప్రారంభించి, రాష్ట్రాన్ని కదిలించే స్థాయికి తీసుకెళ్తాం” అని చిర్రాయా కన్నా గట్టిగా హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్.కే. సాజన్, జక్కుల యాక సాయిలు, మంచాల శ్రీను, సిదిమల్లె వెంకటలక్ష్మి, భూతం లాలమ్మ, కృష్ణ, ఉపేంద్ర, హెచ్. సిద్దు తదితరులు పాల్గొన్నారు.
TELANGANA
అఖిల భారత రైతు కూలీ.సంఘం.కమిటీ.ఆధ్వర్యంలో
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఏసీబీ అధికారులకు చిక్కిన పేట RDO రాంచందర్ నాయక్
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రసాయన శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎం.డి. ఖాజా ఆరిఫ్ కి, రసాయన శాస్త్రంలో పి.హెచ్.డి. పట్టా
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
దోస్త్ మిల్గయా పోరాట యోధునికి ములుగు జిల్లా స్వాగతం సుస్వాగతం పలుకుతోంది