• Other News
  • Live TV
  • పశ్చిమబెంగాల్లో బిజెపి అధికారంలోకి రావడం దేశానికి ఎంతో అవసరం

    Reporter
    Journalist Chinna Telangana  |  May 4, 2026, 6:32 pm
    పశ్చిమబెంగాల్లో బిజెపి అధికారంలోకి రావడం దేశానికి ఎంతో అవసరం

    చౌటుప్పల్, మే 04,(వార్త పత్రిక);భారతీయ జనతా పార్టీ చౌటుప్పల మున్సిపల్ మరియు రూరల్ శాఖ ఆధ్వర్యంలో పశ్చిమబెంగాల్ అసోం మరియు పుదుచ్చేరి రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ జెండా
    రెపరెపలాడినందుకు గాను చౌటుప్పల్ మున్సిపల్ బస్టాండ్ ఆవరణలో బాణా సంచా కాల్చి మిఠాయిలు పంచి బిజెపి శ్రేణులు సంబరాలు చేసుకోవడం జరిగింది. పశ్చిమబెంగాల్లో బిజెపి అధికారంలోకి రావడం దేశానికి ఎంతో అవసరం అదేవిధంగా 2028 ఎలక్షన్లలో తెలంగాణలో బిజెపి జెండా ఎగురవేసే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కంకణ బద్ధులై పని చేయాలని బిజెపి శ్రేణులు కోరడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో నల్గొండ జిల్లా బిజెపి అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి,మున్సిపల్ అధ్యక్షులు కడారి కల్పన యాదవ్,రూరల్ అధ్యక్షులు కైరం కొండ అశోక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దూడల భిక్షం గౌడ్, రమణగోని శంకరయ్య,గుజ్జుల సురేందర్ రెడ్డి,ముత్యాల భూపాల్ రెడ్డి, చినుకుని మల్లేశం,కంచర్ల గోవర్ధన్ రెడ్డి,పాలకూరల జంగయ్య,రెడ్డిబాయ్ సర్పంచ్ నందగిరి వెంకటేశం,కాట్రేవ్ సర్పంచ్ బోయ మహేంద్ర మనీ,కౌన్సిలర్లు పోలపల్లి లక్ష్మీ ముత్తయ్య,బుడ్డ సురేష్, ఉడుగు వెంకటేశం,బత్తుల జంగయ్య గౌడ్,ఉడుగు యాదయ్య గౌడ్,దాసోజు బిక్షమాచారి,గోషిక నీరజ, దిండు భాస్కర్,రాధారపు సత్తయ్య,కడారి ఐలయ్య, పబ్బతి శేఖర్,అమృతం దశరథ,కాసుల వెంకటేశం గౌడ్,వరగంటి భాను ప్రకాష్, కానుగు కొండల్,కాసోజు గోపి, బాలరత్నం,బూత్ అధ్యక్షులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

    📰 e-Paper Clip
    Google News Follow