చౌటుప్పల్, మే 07,(వార్త పత్రిక);చౌటుప్పల్‌లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పరిశీలించారు.ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను హరీశ్ రావు దృష్టికి తీసుకువచ్చారు.గత 30 రోజులుగా ధాన్యం కొనుగోలు కోసం ఎదురుచూస్తున్నామని, క్వింటాకు 7 కిలోల వరకు తరుగు తీస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
లారీలు అందుబాటులో లేకపోవడం,గన్నీ బ్యాగుల కొరత తీవ్రంగా ఉందని తెలిపారు.అలాగే లంచాలు ఇవ్వనిదే కాంటాలు వేయడం లేదని, అకాల వర్షాలతో ధాన్యం తడిసి రంగు మారిపోతుందని రైతులు తమ గోడును హరీశ్ రావుకు వివరించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు
TELANGANA NALGONDA
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఏసీబీ అధికారులకు చిక్కిన పేట RDO రాంచందర్ నాయక్
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రసాయన శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎం.డి. ఖాజా ఆరిఫ్ కి, రసాయన శాస్త్రంలో పి.హెచ్.డి. పట్టా
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
దోస్త్ మిల్గయా పోరాట యోధునికి ములుగు జిల్లా స్వాగతం సుస్వాగతం పలుకుతోంది