• Other News
  • Live TV
  • ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక రైతు వారము

    Reporter
    Journalist Chinna Telangana  |  May 7, 2026, 3:39 pm
    ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక రైతు వారము

    చౌటుప్పల్, మే 07,(వార్త పత్రిక);రైతు వారోత్సవాలు ఈ ప్రణాళికలో భాగంగా మే 4 నుండి 9 వరకు 'రైతు వారం' నిర్వహించారు అందులో భాగంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ లోని రైతు వేదికలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక రైతు వారం కార్యక్రమంలో పాల్గొన్న
    చౌటుప్పల్ మున్సిపల్ చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇంధన శాఖ, వ్యవసాయ రంగాల సమన్వయంతో రైతుల సాధికారత, సౌరశక్తి వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించింది. 'ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక' (99 రోజుల కార్యాచరణ) లో భాగంగా రైతులకు మేలు చేసే పలు కార్యక్రమాలను చేపడుతోంది అన్నారు,అన్నదాత - విద్యుత్ ప్రదాత సౌర విద్యుత్ ప్లాంట్లు రైతులు తమ పొలాల్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా 'అన్నదాత' (రైతు) నుండి 'విద్యుత్ ప్రదాత' (విద్యుత్ ఉత్పత్తిదారు)గా మారుతారు సోలార్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ను డిస్కంలకు విక్రయించి స్థిరమైన ఆదాయం పొందవచ్చు అని అన్నారు.ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి,
    సింగిల్ విండో వైస్ చైర్మన్ చేన్నగోని అంజయ్య గౌడ్, వ్యవసాయ మండల అధికారి నాగరాజు, కౌన్సిలర్లు కొసనం రాకేష్ రెడ్డి,పాక చిరంజీవి,విద్యుత్ శాఖ అధికారులు, సీఈ,డి ఈ, ఏ ఈ,సర్పంచ్ శ్రీధర్ రావు, రైతులు, విద్యుత్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు

    📰 e-Paper Clip
    Google News Follow