వార్తాపత్రిక గండిపేట్: నర్సింగ్ సర్కిల్ వాక్ ఫర్ వాటర్'కు పిలుపు నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న తీవ్ర నీటి ఎద్దడిని నిరసిస్తూ, ఈ నెల 16వ తేదీన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా మరియు "వాక్ ఫర్ వాటర్" కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నార్సింగి సర్కిల్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ప్రకటించారు. "మా నీరు మాకే ఇవ్వండి" అనే నినాదంతో ఈ ఆందోళన చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.నార్సింగి సర్కిల్ పరిధిలోని వివిధ గ్రామాల్లో తాగునీటి సమస్య జటిలమవుతోందని, వాటర్ వర్క్స్ అధికారులు నీటి సరఫరాలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానిక నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, నేడు బీఆర్ఎస్ నాయకులు అధికారులను కలిసి సమస్యను వివరించారు. సరైన నీటి సరఫరా లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నిరసన కార్యక్రమాన్ని సిద్ధం చేస్తున్నారు.
పాల్గొన్న ముఖ్య నాయకులు:ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడు షేక్ ముక్తార్, సీనియర్ నాయకులు నరసింహ, బొమ్మాలి మల్లేష్, గణేష్ రెడ్డి, గణేష్, మహిపాల్, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే మహిళా విభాగం నుంచి అధ్యక్షురాలు తనీషా, ఇందిరమ్మ, సుమిత్ర తదితరులు తమ మద్దతు తెలిపారు.16వ తేదీన జరగబోయే ఈ ధర్నాలో నార్సింగి సర్కిల్ పరిధిలోని ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని నర్సింగ్ సర్కిల్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కోరారు.
TELANGANA RANGAREDDY
నార్సింగిలో నీటి కష్టాలు ఈ నెల 16న బీఆర్ఎస్ భారీ ధర్నా
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఏసీబీ అధికారులకు చిక్కిన పేట RDO రాంచందర్ నాయక్
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రసాయన శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎం.డి. ఖాజా ఆరిఫ్ కి, రసాయన శాస్త్రంలో పి.హెచ్.డి. పట్టా
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
దోస్త్ మిల్గయా పోరాట యోధునికి ములుగు జిల్లా స్వాగతం సుస్వాగతం పలుకుతోంది