వార్తాపత్రిక, కుత్బుల్లాపూర్, మే 12:
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి ప్రతి ఓటును క్షుణ్ణంగా పరిశీలించాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద సూచించారు. 129వ డివిజన్ పరిధిలోని టీఎస్‌ఎస్‌సీ కాలనీలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఓటర్ల ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్‌తో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బూత్ ఇన్‌చార్జీలు, బీఎల్ఓలతో సమన్వయం చేసుకుంటూ ఓట్ల మ్యాపింగ్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.
బస్తీలలో బీఎల్ఓలు నిర్వహిస్తున్న ఓటర్ వెరిఫికేషన్ సమయంలో కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి అధికారులకు సహకరించాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ
కార్యక్రమంలో డివిజన్ కమిటీ నాయకులు, వెల్ఫేర్ కమిటీ సభ్యులు, మహిళా ప్రతినిధులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
TELANGANA RANGAREDDY
ఓటర్ల జాబితా సవరణలో అప్రమత్తంగా ఉండాలిబీఆర్‌ఎస్ శ్రేణులకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద సూచన
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఏసీబీ అధికారులకు చిక్కిన పేట RDO రాంచందర్ నాయక్
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రసాయన శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎం.డి. ఖాజా ఆరిఫ్ కి, రసాయన శాస్త్రంలో పి.హెచ్.డి. పట్టా
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
దోస్త్ మిల్గయా పోరాట యోధునికి ములుగు జిల్లా స్వాగతం సుస్వాగతం పలుకుతోంది