అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళ విద్యార్థులతో ముచ్చటించిన ఓ వీడియోను ఆదివారం తన యూట్యూబ్ ఛానల్లో పోస్టు చేశారు. అందులో రాహుల్ గాంధీ విద్యార్థులతో మాట్లాడుతూ, 'ముగ్గురు మహిళలు బాస్‌లుగా ఉన్న కుటుంబంలో తాను పెరిగానని' అన్నారు. సాధారణంగా పురుషుల కంటే మహిళే తెలివైన వారని ఆయన అభిప్రాయపడ్డారు. కొన్ని రోజుల క్రితం కేరళ కేరళలో లంచ్ ఇంటరాక్షన్ సమయంలో కొంత మంది విద్యార్థినులను కలిశానని, వారితో చాలా ఆసక్తికర సంభాషణ జరిగిందని పేర్కొన్నారు.'ప్రతి విద్యార్థిని కలలు, ఉత్సుకత, ఆత్మవిశ్వాసం నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మహిళలు తమ సామర్థ్యాన్ని గుర్తించి, ఓపెన్ మైండ్‌తో ముందుకు సాగినప్పుడు, వారు అసాధారణ మార్పులను తీసుకురాగలరని ఇటువంటి సంభాషణలు మనకు గుర్తు చేస్తాయి' అని రాహుల్ అన్నారు. "ప్రతి మహిళ ఒక విశిష్ఠమైనది. వారికున్న సున్నితత్వం, అవగాహన, మేధస్సు (ఎమోషనల్ ఇంటెలిజెన్స్) సమాజానికి తగిన సమతుల్యతను, దిశానిర్దేశాన్ని అందిస్తాయి. మహిళలు తమదైన మార్గాల్లో చాలా ఓర్పుతో, దీర్ఘకాలిక దృక్పథంతో అధికారాన్ని కలిగి ఉంటారు. కాబట్టి వాళ్లు సమాజం విధించే పరిమితులకు లోబడకుండా, తమ గుర్తింపు, వ్యక్తిత్వం, ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు సాగేందుకు అవసరమైన ప్రతి హక్కును కలిగి ఉంటారు" అని ఆయన ఎక్స్‌లో మరో పోస్టు పెట్టారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత మహిళలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. "మీ బలం, ధైర్యం, కలలు సమాజాన్ని సానుకూల భవిష్యత్తు వైపునకు నడిపించాలి" అని ఆకాంక్షించారు.ఎంతో స్ఫూర్తినిచ్చింది!
కేరళలోని యువ విద్యార్థులతో ముచ్చటించడం తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని రాహుల్ పేర్కొన్నారు. "వారి ఆత్మవిశ్వాసం, తమ కలలపై ఉన్న నమ్మకం, మహిళలే మార్పునకు అంతిమ శక్తి అని నిరూపిస్తున్నాయి" అని అన్నారు. ఆ వీడియోలో రాహుల్ గాంధీ విద్యార్థినులతో సరదాగా ముచ్చటిస్తూ కనిపించారు.
NATIONAL
'ముగ్గురు మహిళలు బాస్‌లుగా ఉన్న కుటుంబంలో పెరిగా'- విద్యార్థులతో రాహుల్ గాంధీ
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
బంగ్లాదేశ్‌లో మరో దారుణం.. పూజలో ఉన్న హిందువులపై బాంబు దాడి
వీణా విద్వాంసురాలు శ్రీవాణిని కలిసిన న్యాయవాద దంపతులు
రూ.15 లక్షల లంచం ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ ఎస్ఈ