• Other News
  • Live TV
  • జేడీయూ పార్టీలో చేరిన నీతీశ్ తనయుడు నిశాంత్​

    Reporter
    Journalist Chinna Telangana  |  March 8, 2026, 4:54 pm
    జేడీయూ పార్టీలో చేరిన నీతీశ్ తనయుడు నిశాంత్​

    బిహార్‌ సీఎం నీతీశ్‌కుమార్‌ కుమారుడు నిశాంత్‌ కుమార్‌ జేడీయూలో చేరారు. పట్నాలోని జేడీయూ హెడ్‌క్వార్టర్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి రాజీవ్‌ రంజన్‌సింగ్, జేడీయూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్‌ ఝా సహా పార్టీ సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిశాంత్​ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు.తన తండ్రి పెద్దల సభకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని, అది ఆయన సొంతంగా తీసుకున్న నిర్ణయమని పేర్కొన్నారు. ఆయన నిర్ణయాన్ని అందరం గౌరవిస్తున్నట్లు చెప్పారు. తనతండ్రి మార్గదర్శకత్వంలో తామంతా పనిచేస్తామని నిశాంత్‌ కుమార్‌ పేర్కొన్నారు. 20ఏళ్లు బిహార్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన తన తండ్రి రాష్ట్రానికి ఎంతో సేవ చేశారని చెప్పారు. బిహార్‌ ప్రజలు ఆయన చేసిన అభివృద్ధిని ఎప్పటికీ మరిచిపోరని తెలిపారు. పార్టీ కండువా కప్పుకున్న అనంతరం తండ్రి నీతీశ్​ను కలిసి మిఠాయి తినిపించారు. ఆయన వెంట సంజయ్​ ఝా కూడా ఉన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow