మహారాష్ట్ర : మూడు చక్రాల ఆటోరిక్షాలపై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ఆటోరిక్షాలకు అనుమతుల మంజూరును నిలిపివేసింది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ ప్రకటించారు. తాజా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా దీనిపై ప్రకటన చేశారు. రాష్ట్రంలో మూడు చక్రాల ఆటోరిక్షాలు సంతృప్త (గరిష్ట) స్థాయికి చేరుకున్నాయని, అందువల్ల నగరాల్లోని రోడ్ల సామర్ధ్యాన్ని, పర్యావరణ సమతుల్యతను దృష్టిలో ఉంచుకుని కొత్త ఆటోలకు అనుమతుల మంజూరును నిలిపివేశామని ప్రభుత్వం తెలిపింది.
2025-26 రాష్ట్ర ఆర్థిక సర్వే ప్రకారం మహారాష్ట్రలో 1.3 మిలియన్లు (12.96 లక్షలు) రిజిష్టర్డ్ త్రీ వీలర్ ఆటోలున్నాయి. ముంబై మెట్రో నగరంలోనూ అధికంగా ఆటోలున్నాయి. గరిష్ట స్థాయిని మించిపోయాయి. ముంబైలో సగటున ఒక కిలోమీటర్‌కు 2,648 ఆటోలు రోడ్లపై తిరుగుతున్నట్లు ఆర్టీవో డాటా తేల్చింది. ఇది ఇండియాలోని అన్ని మెట్రో నగరాలకంటే అత్యధికం. ముంబై చుట్టుపక్కల ప్రాంతాల్లోనే 2.5 లక్షల ఆటోలు ఉన్నాయి. దీంతో నగరంలో ‘లేన్ టు వెహికల్’ స్థాయి మించిపోయింది. పార్కింగ్‌కు కూడా సమస్యలొస్తున్నాయి. ట్రాఫిక్ సమస్య ఎక్కువైంది. పర్యవరణానికి కూడా హాని కలుగుతోంది. ఇప్పటికే ముంబైలో వాయు కాలుష్యం ఎక్కువైంది. ప్రస్తుతం ఏక్యూఐ 170-200 వరకు ఉంది. ఇది అనారోగ్య స్థాయి. సగటున 50-100 వరకు ఉండాలి. సీఎన్‌జీ ఆటోలతో కూడా ఎక్కువ వాయు కాలుష్యం అవుతోందిఈ నేపథ్యంలోనే కాలుష్యాన్ని తగ్గించేందుకు ముంబై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మెట్రో కారిడార్ పెంపు, ఎలక్ట్రిక్ బస్సులవైపు దృష్టిసారించింది. అలాగే కొత్త ఆటోలకు అనుమతి నిరాకరించింది. ఈ చర్యల వల్ల ట్రాఫిక్ తగ్గడం, కాలుష్యం తగ్గడంతోపాటు ఆటో రిక్షా నడిపే వారి ఆదాయం కూడా పెరుగుతుంది. అలాగే ఆటోలకు సంబంధించి సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించే వీలుంటుంది. కొత్త ఆటోలు రాకపోవడంతో ఇప్పుడున్న వాటి ద్వారా డ్రైవర్లకు మెరుగైన ఆదాయం లభిస్తుంది.
NATIONAL
మహారాష్ట్రలో కొత్త త్రీ వీలర్ ఆటోలపై నిషేధం విధించిన ప్రభుత్వం.
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
బంగ్లాదేశ్‌లో మరో దారుణం.. పూజలో ఉన్న హిందువులపై బాంబు దాడి
వీణా విద్వాంసురాలు శ్రీవాణిని కలిసిన న్యాయవాద దంపతులు
రూ.15 లక్షల లంచం ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ ఎస్ఈ