• Other News
  • Live TV
  • కరూర్‌ తొక్కిసలాట కేసు.. నటుడు విజయ్‌కి మళ్లీ సీబీఐ సమన్‌లు

    Reporter
    Journalist Chinna Telangana  |  March 9, 2026, 5:32 pm
     కరూర్‌ తొక్కిసలాట కేసు.. నటుడు విజయ్‌కి మళ్లీ సీబీఐ సమన్‌లు

    కరూర్‌ :కరూర్‌ తొక్కిసలాట కేసులో టీవీకే పార్టీ అధినేత , నటుడు విజయ్ ‌ కి సీబీఐ మరోసారి సమన్లు జారీచేసింది. మార్చి10న విచారణకు హాజరుకావాలని సూచించింది. కాగా గత ఏడాది సెప్టెంబర్‌ 27న కరూర్‌ (లో విజయ్‌ నిర్వహించిన ప్రచారసభలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయారు.సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే దర్యాప్తు సంస్థ విచారణకు హాజరుకావాలని సమన్లు జారీచేసింది. కరూర్‌ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుండటంతో విచారణలో భాగంగా విజయ్‌ ఇప్పటికే పలుమార్లు ఢిల్లీలోని దర్యాప్తు కార్యాలయానికి హాజరయ్యారు. ఇప్పటివరకు సేకరించిన ఆధారాలపై విజయ్‌ స్పష్టతనివ్వాల్సి ఉండటంతో అతడికి మరోసారి నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.ర్యాలీ సమయంలో జనసమూహ నిర్వహణ ఏర్పాట్లు, ఈవెంట్ వేదికకు మంజూరు చేసిన అనుమతులు, టీవీకే పార్టీ వాదనలు, తమిళనాడు ప్రభుత్వ వాదనలపై తాము దర్యాప్తు చేస్తున్నామని అధికారులు చెప్పారు.

    📰 e-Paper Clip
    Google News Follow