చెన్నై: ప్రముఖ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే)తో ఎన్డీయే పొత్తు కుదుర్చుకునే అవకాశం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ స్పష్టం చేశారు. కరూర్ దుర్ఘటనకు సంబంధించి విజయ్‌కి సీబీఐ సమన్లు ఇవ్వడం, ఆయన నటించిన ‘జననాయగన్’ సినిమా సెన్సార్ ప్రక్రియలో జాప్యానికి బీజేపీ కారణం కాదన్నారు. ఆ రెండు వ్యవహారాల్లో టీవీకేపై బీజేపీ ఒత్తిడి చేసి పొత్తుకు ప్రయత్నిస్తోందంటూ ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వదంతులను ఆయన ఖండించారు.బుధవారం తిరుచ్చిలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొననున్న భారీ సభ ఏర్పాట్లపై తంజావూరు జిల్లా కుంభకోణంలో పార్టీ నాయకులతో ఆయన సమీక్ష జరిపారు. ఆ సమవేశం అనంతరం నయినార్ నగేంద్రన్ మీడియాతో మాట్లాడుతూ... టీవీకే ఆధ్వర్యంలో కరూర్ వేలుచ్చామిపురంలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతిచెందిన వ్యవహారంలో మంగళవారం విచారణకు హాజరుకావాల్సిందిగా సీబీఐ అధికారులు పంపిన ఉత్తర్వులకు, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. విజయ్‌ను బెదిరించి ఎన్డీయే కూటమిలో చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని, మరోవైపు బీజేపీతో పొత్తు ఖరారైందని సోషల్ మీడియాల్లో వస్తున్న కథనాలన్నీ అవాస్తవమన్నారు.
NATIONAL
విజయ్ పార్టీతో పొత్తులేదు..
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
బంగ్లాదేశ్‌లో మరో దారుణం.. పూజలో ఉన్న హిందువులపై బాంబు దాడి
వీణా విద్వాంసురాలు శ్రీవాణిని కలిసిన న్యాయవాద దంపతులు
రూ.15 లక్షల లంచం ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ ఎస్ఈ