పశ్చిమబెంగాల్లో ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష పూర్తయ్యాక కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) త్వరలోనే 4 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశముంది. అసోం, కేరళం, తమిళనాడు, పశ్చిమబెంగాల్, పుదుచ్చేరిలలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే ఛాన్స్ ఉంది. దాదాపుగా ఈ వారంలోగా ఈ షెడ్యూల్‌ను ప్రకటించే వీలుందని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి.
ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ నేతృత్వంలోని పూర్తిస్థాయి ఈసీ బృందం పశ్చిమబెంగాల్‌లో పర్యటిస్తోంది. అక్కడ ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష అనంతరం తిరిగి ఢిల్లీకి వెళ్లనుందీ బృందం. ఇక.. ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి తమిళనాడు, అసోం, కేరళ సహా పుదుచ్చేరిలో ఈసీ ఇప్పటికే పరిశీలన పూర్తిచేసింది. బెంగాల్ సమీక్ష అనంతరం షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశమున్నట్టు సమాచారం.
అయితే.. ఈ అసెంబ్లీ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించాలని పశ్చిమబెంగాల్‌లో పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈసీని కోరారని తెలుస్తోంది. ఈ మేరకు సీఈసీ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషీ, బెంగాల్ సీఈవో మనోజ్ అగర్వాల్‌లు సోమవారం కోల్‌కతాలో పలు పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీకి ఆయా పార్టీలు విజ్ఞప్తి చేశాయి. టీఎంసీ, భాజపా, సీపీఎం, కాంగ్రెస్, ఆప్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అంతకముందు సీఈసీని కలిసిన బెంగాల్ భాజపా ప్రతినిధుల బృందం.. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు భద్రతా అంశాలపై ఆందోళనలను వ్యక్తంచేస్తూ 16 పాయింట్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించింది.
NATIONAL
ఆ 4 రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్!
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
బంగ్లాదేశ్‌లో మరో దారుణం.. పూజలో ఉన్న హిందువులపై బాంబు దాడి
వీణా విద్వాంసురాలు శ్రీవాణిని కలిసిన న్యాయవాద దంపతులు
రూ.15 లక్షల లంచం ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ ఎస్ఈ