జెరుసలాం: ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దళాలు దాడి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ నాటి నుంచి ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై ప్రతిదాడి చేస్తూనే ఉన్నది. అయితే ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌పై ఇరాన్ సుమారు 300 బాలిస్టిక్ క్షిపణులను రిలీజ్ చేసింది. దాంట్లో సగం వరకు క్లస్టర్ బాంబులతో కూడి వార్‌హెడ్స్ ఉన్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్పేర్కొన్నది. మంగళవారం కూడా ఇరాన్ తన క్షిపణులను ప్రయోగించింది. అయితే వాటిని తిప్పికొడుతున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే భారీ వార్‌హెడ్‌తో వచ్చిన ఓ క్షిపణి.. బీట్ షెమేస్‌లో ఉన్న ఓ ఖాళీ స్థలంలో పడినట్లు అధికారులు చెప్పారు. ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు.క్లస్టర్ బాంబుల్లో ఉన్న వార్‌హెడ్స్ అత్యంత ప్రమాదకరమైనవి. క్షిపణి పేలిన తర్వాత వాటి నుంచి పేలుడు పదార్ధాలు డజన్ల సంఖ్యలో వేరుపడుతాయి. సబ్‌మ్యునిషేన్స్‌లో కిలోల కొద్దీ పేలుడు పదార్ధాలు ఉంటాయి. అయితే అవి కనీసం పది కిలోమీటర్ల దూరం చెల్లాచెదురుగా పడే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. క్లస్టర్ బాంబులను వదిలే క్షిపణులను ప్రస్తుతానికి సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని, కానీ వాటి వాళ్లు సవాళ్లు ఉన్నట్లు ఇజ్రాయెల్ మిలిటరీ పేర్కొన్నది. ఇజ్రాయెల్ వైమానిక క్షేత్రం సంపూర్ణంగా సురక్షితంగా లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.గత జూన్‌లో సుమారు 12 రోజుల పాటు ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య వార్ జరిగింది. అయితే ఆ సమయంలో ఇరాన్ కనీసం మూడు సార్లు ఇజ్రాయెల్‌పై క్లస్టర్ బాంబులను జారవిడిచినట్లు తెలిసింది. ఫోటోలు, వీడియో ఆధారంగా ఈ విషయాన్ని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ద్రువీకరించింది. క్లస్టర్ మ్యునిషన్స్‌పై 2008లో కుదిరిని ఒప్పందం ప్రకారం ఆ బాంబులను వాడరాదు. అప్పట్లో వంద దేశాలు ఆ ఒప్పందంపై సంతకం చేశాయి. కానీ ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా ఆ ఒప్పందంపై సంతకం చేయలేదు. తాజా ఇరాన్ దాడి వల్ల సుమారు 12 మంది మృతిచెందగా, రెండు వేల మంది గాయపడ్డారని అధికారులు చెప్పారు.
INTERNATIONAL
300 క్షిపణులు ఫైర్ చేసిన ఇరాన్.. వాటిల్లో సగం క్లస్టర్ బాంబ్ వార్‌హెడ్స్
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఏసీబీ అధికారులకు చిక్కిన పేట RDO రాంచందర్ నాయక్
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రసాయన శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎం.డి. ఖాజా ఆరిఫ్ కి, రసాయన శాస్త్రంలో పి.హెచ్.డి. పట్టా
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
దోస్త్ మిల్గయా పోరాట యోధునికి ములుగు జిల్లా స్వాగతం సుస్వాగతం పలుకుతోంది