ఇరాన్, అమెరికా -ఇజ్రాయెల్ యుద్ధంతో ఇంధన సంక్షోభం ముసురుకుంటోంది. ఇప్పుడు భారత్‌లోనూ ఈ ప్రభావం కనిపిస్తోంది. మన దేశంలోని పలు ప్రాంతాలలో వంటగ్యాస్ కొరత ఏర్పడింది. ఎల్‌పీజీ సిలిండర్ ధర సగటున రూ.60 దాకా పెరిగింది. ఈనేపథ్యంలో బంగాల్‌లోని పశ్చిమ బుర్ద్వాన్ జిల్లా గోపాల్‌పూర్ గ్రామానికి చెందిన క్షేత్రనాథ్ గరై, అమ్జాన్ గరై ఆవు పేడతో ఇళ్లలోనే బయోగ్యాస్‌ను తయారు చేసుకుంటున్నారు. తద్వారా వంటగ్యాస్ సంక్షోభం ఎఫెక్ట్ తమపై పడకుండా జాగ్రత్తపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ప్రజలకు, ప్రభుత్వానికి ఈ ఇద్దరు ఇస్తున్న సలహా ఏమిటి ? ఆవుపేడతో బయోగ్యాస్ తయారీకి చొరవ చూపుతున్న వారి గురించి ప్రభుత్వ వర్గాలు ఏమంటున్నాయి ? ఇంతకీ ఆవుపేడతో బయోగ్యాస్ తయారీ ఎలా ? ఈ కథనంలో తెలుసుకుందాం.ఆవు పేడతో వంటగ్యాస్ తయారీ ఇలాగోపాల్‌పూర్ గ్రామానికి చెందిన క్షేత్రనాథ్ గరై, అమ్జాన్ గరై కుటుంబాలకు పెద్ద సంఖ్యలో ఆవులు ఉన్నాయి. దీంతో వారికి రోజూ పుష్కలంగా ఆవుపేడ లభిస్తుంది. ఈ పేడ, నీటిని 1:1 నిష్పత్తిలో కలిపి సజాతీయ మిశ్రమంగా మారుస్తారు. దీన్ని భూగర్భంలో తవ్విన ప్రత్యేక గొయ్యి (డైజెస్టర్ ట్యాంకు)లో నిల్వ చేస్తారు. ఇందులోకి గాలి కూడా చొరబడదు. ఫలితంగా ఈ ట్యాంకులోని పేడను బ్యాక్టీరియా విచ్ఛిన్నం చేస్తుంది. దీని పర్యవసానంగా పేడ నుంచి మీథేన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. డైజెస్టర్ ట్యాంకుకు మరో వైపున అమర్చిన పైపుల ద్వారా మీథేన్ గ్యాస్ అనేది వంటగ్యాస్ స్టవ్‌లోకి చేరుతుంది. క్షేత్రనాథ్ గరై, అమ్జాన్ గరై కుటుంబాలు ఇప్పుడు ఈవిధంగానే ఆవుపేడతో బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేసుకుంటున్నాయి. వంటగ్యాస్ సంక్షోభం ప్రభావం తమపై పడకుండా జాగ్రత్తపడుతున్నాయి.
INTERNATIONAL
ఇంధన సంక్షోభానికి ఇంట్లోనే పరిష్కారం- ఆవుపేడతో వంటగ్యాస్- రోల్ మోడల్‌గా ఆ రెండు కుటుంబాలు!
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
బంగ్లాదేశ్‌లో మరో దారుణం.. పూజలో ఉన్న హిందువులపై బాంబు దాడి
వీణా విద్వాంసురాలు శ్రీవాణిని కలిసిన న్యాయవాద దంపతులు
రూ.15 లక్షల లంచం ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ ఎస్ఈ