• Other News
  • Live TV
  • హర్మూజ్​ను దాటుకొని భారత్​కు చేరిన నౌక- ఇరాన్ అనుమతితో!

    Reporter
    Journalist Chinna Telangana  |  March 12, 2026, 4:37 pm
    హర్మూజ్​ను దాటుకొని భారత్​కు చేరిన నౌక- ఇరాన్ అనుమతితో!

    పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత నేతృత్వంలోని ఓ నౌక వ్యూహాత్మకంగా కీలకమైన హర్మూజ్ జలసంధిని దాటింది. ఈ ఓడ లైబీరియా జెండాను పెట్టుకుని ముడి చమురు ట్యాంకర్​ను ముంబయి ఓడరేవుకు చేరుకుంది. సౌదీ అరేబియాలోని రాస్ తనురా ఓడరేవులో ముడి చమురు లోడ్‌ను తీసుకువచ్చిన షెన్‌లాంగ్ సూయెజ్‌మాక్స్ నౌక బుధవారం ముంబయికి చేరుకుందని పోర్ట్ ట్రస్ట్ వెల్లడించింది. జలసంధి గుండా వెళ్లేందుకు ఇరాన్​ అనుమతి ఇచ్చిన తర్వాతే చేరుకుందని వివరించింది. మార్చి 1న రాస్ తనురా నుంచి నౌక బయలుదేరినట్లు పేర్కొంది.

    హర్మూజ్​ దాటేందుకు భారత్​కు ఇరాన్​ అనుమతి
    అంతకుముందు హర్మూజ్ జలసంధి ద్వారా భారతీయ నౌకలు పయనించడానికి మార్గం సుగమం అయ్యింది. భారత జెండాతో ప్రయాణించే ట్యాంకర్లు హర్మూజ్ జలసంధి గుండా వెళ్లేందుకు ఇరాన్ అనుమతించింది. ఈ జలమార్గం ద్వారా ముడిచమురు, సహజ వాయువు రవాణా సురక్షితంగా జరిగేలా చూడాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీని ఫోన్‌లో కోరారు. ఇందుకు టెహ్రాన్ సానుకూలంగా స్పందించింది. ఈ నేపథ్యంలో భారత జెండాతో ఉన్న పుష్పక్, పరిమల్ అనే ట్యాంకర్లు సురక్షితంగా హోర్ముజ్‌ జలసంధిని దాటినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తాజాగా షెన్‌లాంగ్ సూయెజ్‌మాక్స్ నౌక భారత్​కు సైతం చేరుకుంది.

    📰 e-Paper Clip
    Google News Follow