న్యూఢిల్లీ: మధ్యప్రాచ్యంలో తలెత్తిన ఉద్రిక్తతలు, భారత నౌకల భద్రతకు సంబంధించి ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రితో భారత విదేశాంగ మంత్రి జైంశంకర్ మూడు రౌండ్లు చర్చలు జరిపినట్టు కేంద్ర విదేశాంగ శాఖ (MEA) గురువారంనాడు తెలిపింది. దీనిపై ఎంఈఏ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. హోర్ముజ్ జలసంధి గుండా భారత్ నౌకలు వెళ్లేందుకు ఇరాన్ అనుమతించిందా అనే ప్రశ్నకు, ప్రస్తుతానికి ఇంతవరకే తాను చెప్పగలనని సమాధానమిచ్చారు.
'డాక్టర్ జైశంకర్, ఇరాన్ విదేశాంగ మంత్రి ఇటీవల మూడుసార్లు సంభాషణలు జరిపారు. చివరిసారిగా భారత నౌకల భద్రత, దేశ ఇంధన భద్రతపై ఉభయులూ చర్చించారు. ఇప్పటికి ఇంతవరకే చెప్పగలను' అని జైశ్వాల్ అన్నారు. ఇరాన్ నుంచి భారతీయుల తరలింపుపై మాట్లాడుతూ, స్వదేశానికి రావాలని కోరుకునే వారికి విదేశాంగ శాఖ హెల్త్ చేస్తోందన్నారు. స్టూడెంట్లు, నావికులు, వ్యాపారులు, ప్రొఫెషనల్స్, యాత్రికులతో కలిపి సుమారు 9,000 మంది భారతీయులు ఇరాన్‌లో ఉన్నారని, టెహ్రాన్‌లో ఉంటున్న విద్యార్థులు, యాత్రికులతో సహా పలువురుని అక్కడి సురక్షిత ప్రాంతాలు, నగరాలకు తరలించామని చెప్పారు. అజర్ బైజన్, అర్మేనియా వెళ్లాలనుకుంటున్న భారతీయులను అక్కడకు చేర్చి, అక్కడి నుంచి స్వదేశానికి కమర్షియల్ విమానాల్లో తీసుకు వస్తున్నామని తెలిపారు. ల్యాండ్ బోర్డర్ క్రాసింగ్‌కు కూడా సహకరిస్తున్నామని చెప్పారు. ఇరాన్ వీడాలని అనుకునే వారు అక్కడి కాన్సులేట్ జారీచేసిన అడ్వయిజరీలను పాటించాలని జైశ్వాల్ సూచించారు.
NATIONAL
భారత నౌకల భద్రతపై ఇరాన్‌తో చర్చలు జరిపిన జైశంకర్.. ఎంఈఏ ప్రకటన
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
బంగ్లాదేశ్‌లో మరో దారుణం.. పూజలో ఉన్న హిందువులపై బాంబు దాడి
వీణా విద్వాంసురాలు శ్రీవాణిని కలిసిన న్యాయవాద దంపతులు
రూ.15 లక్షల లంచం ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ ఎస్ఈ