• Other News
  • Live TV
  • గ్యాస్‌ కొరతతో పెరుగుతున్న సైబర్‌ నేరాలు..

    Reporter
    Journalist Chinna Telangana  |  March 13, 2026, 4:30 pm
    గ్యాస్‌ కొరతతో పెరుగుతున్న సైబర్‌ నేరాలు..

    ముంబై: వంట గ్యాస్‌ కొరత నేపథ్యంలో సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయి. సైబర్‌ నేరగాళ్లు అప్‌డేట్‌ పేరుతో ఇద్దరు మహిళలను మోసగించారు. వారి బ్యాంకు ఖాతాల నుంచి రూ.4 లక్షలు కొల్లగొట్టారు. (ఫిర్యాదులు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కల్యాణ్‌-డోంబివ్లి ప్రాంతానికి చెందిన ఇద్దరు మహిళలను సైబర్ నేరగాళ్లు టార్గెట్‌ చేశారు. గ్యాస్‌ కొరత నేపథ్యంలో మహానగర్ గ్యాస్ లిమిటెడ్ డిస్ట్రిబ్యూటర్‌ సంస్థ ప్రతినిధుల పేరుతో వారికి ఫోన్‌ చేశారు. గ్యాస్ సిలిండర్‌ కనెక్షన్‌ సమాచారం అప్‌డేట్ చేసుకోవాలని చెప్పారు. వారి మొబైల్‌ ఫోన్లకు ఏపీకే ఫైల్‌ పంపారు. దానిని డౌన్‌లోడ్ చేయించి ఓపెన్‌ చేయించారు.కాగా, ఒక ఫారమ్‌ పూరించాలని ఇద్దరు హిళలకు సైబర్‌ నేరగాళ్లు సూచించారు. వారు ఆ ప్రక్రియ పూర్తి చేయగా వారి బ్యాంకు ఖాతాల నుంచి సుమారు రూ. 4 లక్షలు డెబిట్ అయ్యాయని మెసేజ్‌లు వచ్చాయి.మరోవైపు ఆందోళన చెందిన బాధిత మహిళలు డోంబివ్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆన్‌లైన్ ఆర్థిక మోసాల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌ అధికారి సుహాస్ హెమాడే తెలిపారు. ఇరాన్‌ యుద్ధం వల్ల దేశంలో నెలకొన్న గ్యాస్‌ కొరత నేపథ్యంలో ఇలాంటి ఆన్‌లైన్ మోసాలు జరుగుతున్నాయని చెప్పారు. సైబర్‌ స్కామ్‌ల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

    📰 e-Paper Clip
    Google News Follow