• Other News
  • Live TV
  • సోన‌మ్ వాంగ్‌చుక్ రిలీజ్‌కు ప్ర‌భుత్వం ఆదేశాలు

    Reporter
    Journalist Chinna Telangana  |  March 14, 2026, 12:40 pm
    సోన‌మ్ వాంగ్‌చుక్ రిలీజ్‌కు ప్ర‌భుత్వం ఆదేశాలు

    న్యూఢిల్లీ: సామాజిక కార్య‌క‌ర్త సోన‌మ్ వాంగ్‌చుక్‌ను రిలీజ్ చేయ‌నున్నారు. ఆర్నెళ్ల క్రితం అత‌న్ని అదుపులోకి తీసుకున్న విష‌యం తెలిసిందే. జాతీయ భ‌ద్ర‌తా చ‌ట్టం కింద అత‌న్ని అరెస్టు చేశారు. లేహ్‌లో జ‌రుగుతున్న అల్ల‌ర్ల నేప‌థ్యంలో సోన‌మ్ వాంగ్‌చుక్‌ను ప్ర‌భుత్వం అదుపులోకి తీసుకున్న‌ది. అయితే ల‌డాఖ్‌లో శాంతి, స్థిర‌త్వం కోసం ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని, అన్ని వ‌ర్గాల‌తో నిర్మాణాత్మ‌క చ‌ర్చ‌లు నిర్వ‌హించే ఉద్దేశంతో ఉన్న‌ట్లు ప్ర‌భుత్వం ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. ఈ నేప‌థ్యంలో సోన‌మ్‌పై ఉన్న నిర్బంధాన్ని త‌క్ష‌ణ‌మే ఎత్తివేయాల‌ని కేంద్ర హోంశాఖ నిర్ణ‌యించిన‌ట్లు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.

    2025, సెప్టెంబ‌ర్ 24వ తేదీన లేహ్‌లో అల్ల‌ర్లు చోటుచేసుకున్నాయి. శాంతి, భ‌ద్ర‌త‌లు క్షీణించాయి. ఈ నేప‌థ్యంలో ఎన్ఎస్ఏ చ‌ట్టం కింద 2025, సెప్టెంబ‌ర్ 26వ తేదీన సోన‌మ్‌ను అరెస్టు చేశారు.లేహ్ జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాల ప్ర‌కారం అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు. ల‌డాఖ్‌లో ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు అన్ని విధాలు ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది. బంద్‌లు, నిర‌స‌న‌లో ప్రాంతం నిర్వీర్యం అవుతున్న నేప‌థ్యంలో హైప‌వ‌ర్ క‌మిటీ ద్వారా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌నున్న‌ట్లు చెప్పింది.

    📰 e-Paper Clip
    Google News Follow