: ఇరాన్ పై ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడుతుందంటూ జరుగుతున్న ప్రచారానికి తెరదించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ముందుజాగ్రత్తగా పెట్రోల్ , డీజిల్ ను.. సీసాలు, డబ్బాలు లాంటి విడి పాత్రలలో నిల్వ చేసుకోవడంపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన జారీచేసింది. అదే సమయంలో దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల్లో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.ఇటీవల తమిళనాడులోని ఒక రిటైల్ అవుట్‌లెట్‌లో వినియోగదారుడికి లూజ్ కంటైనర్‌లో పెట్రోల్ పోసిన విషయం తమ దృష్టికి వచ్చిందని పెట్రోలియం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది భద్రతా నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని, అందుకే ఆ పెట్రోల్ బంక్ లైసెన్స్‌ను తక్షణమే సస్పెండ్ చేసి, సంబంధిత యాజమాన్యంపై చర్యలు తీసుకున్నామని వెల్లడించింది. ఇలాంటి చర్యలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని పేర్కొన్నది.ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని రిటైల్ అవుట్‌లెట్‌లు, డీలర్లకు కఠిన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. ఇంధనాన్ని సరఫరా చేసేటప్పుడు భద్రతా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని, నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. పెట్రోల్ వంటి మండే స్వభావం ఉన్న ఇంధనాన్ని అసురక్షిత పద్ధతుల్లో నిల్వ చేయడంవల్ల తీవ్రమైన అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని, ప్రజలు ఈ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కేంద్రం సూచించింది.
NATIONAL
పెట్రోల్‌ను లూజ్‌గా అమ్మడం నిలిపేయండి.. పెట్రోల్ పంపులకు కేంద్రం వార్నింగ్
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఏసీబీ అధికారులకు చిక్కిన పేట RDO రాంచందర్ నాయక్
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రసాయన శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎం.డి. ఖాజా ఆరిఫ్ కి, రసాయన శాస్త్రంలో పి.హెచ్.డి. పట్టా
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
దోస్త్ మిల్గయా పోరాట యోధునికి ములుగు జిల్లా స్వాగతం సుస్వాగతం పలుకుతోంది