న్యూఢిల్లీ, మార్చి 13: బ్యాంకును మోసం చేశారన్న కేసులో ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్ అంబానీని శుక్రవారం సీబీఐ విచారించింది. ఇక్కడి ప్రధాన కార్యాలయంలో సుమారు ఆరున్నర గంటల పాటు పలు ప్రశ్నలు వేసింది. శనివారం కూడా విచారణ కొనసాగనుందని అధికారవర్గాలు తెలిపాయి. రిలయెన్స్ హోం ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్‌హెచ్‌ఎ్‌ఫఎల్) పేరుతో రుణం తీసుకొని రూ.228 కోట్ల మేర మోసం చేసినట్టు ఆయనపై కేసు నమోదయింది. ఆ సంస్థకు డైరెక్టర్‌గా పనిచేయడంతో అన్మోల్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆయనతో పాటు ఆ సంస్థ మాజీ సీఈఓ, పూర్తికాల డైరెక్టర్ రవీంద్ర సుధాకర్, మరికొందరిపైనా కేసులు పెట్టింది. తమ నుంచి రుణం తీసుకొని తిరిగి చెల్లించలేదంటూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (పూర్వ ఆంధ్రాబ్యాంకు) చేసిన ఫిర్యాదు మేరకు 2019లో సీబీఐ కేసు నమోదు చేసింది.
NATIONAL
అనిల్ అంబానీ కుమారుడ్ని విచారించిన సీబీఐ
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఏసీబీ అధికారులకు చిక్కిన పేట RDO రాంచందర్ నాయక్
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రసాయన శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎం.డి. ఖాజా ఆరిఫ్ కి, రసాయన శాస్త్రంలో పి.హెచ్.డి. పట్టా
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
దోస్త్ మిల్గయా పోరాట యోధునికి ములుగు జిల్లా స్వాగతం సుస్వాగతం పలుకుతోంది