టీవీకే జిల్లా : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ త్వరలో ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ చర్చలు వేడెక్కాయి. ముఖ్యంగా దళపతి విజయ్ నేతృత్వంలోని తమిగళ వెట్రి కజగంపైనే అందిరి దృష్టి నెలకొంది. అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏతో పొత్తు ఉంటుందని వార్తలు వస్తోన్న ఈ క్రమంలో విజయ్ పార్టీ క్లారిటీ ఇచ్చింది. ఎన్డీఏ కూటమితో పొత్తుకు ఎటువంటి ఆస్కారం లేదని స్పష్టం చేసింది. ఈ విషయమై జరుగుతున్న చర్చలు కేవలం ఊహాగానాలు మాత్రమే అని కొట్టిపారేసింది.
టీవీకే జిల్లా కార్యదర్శులతో జరిగిన వర్చువల్ సమావేశంలో పార్టీ బలాబలాలు సహా పొత్తులపై చర్చ జరిగిందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నిర్మల్ కుమార్ తెలిపారు. ఎన్డీఏతో పొత్తుకు అవకాశమే లేదన్న ఆయన సిద్ధాంతాల పరంగా బీజేపీ తమకు శత్రువని పేర్కొన్నారు. ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని పోటీ చేస్తే విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయని జిల్లా కార్యాదర్శులు, టీవీకే ప్రధాన కార్యదర్శికి తెలియజేసినట్లు తెలిసింది. ప్రజల సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు ఈ ప్రచారం జరుగుతోందని పేర్కొంటూ, పార్టీ సభ్యులు అధికారిక ప్రకటనలనే నమ్మాలని కోరారు.'తమిళనాడు ప్రజల సమస్యలపై దృష్టి'అటు టీవీకేతో పొత్తు గురించి తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ను ప్రశ్నించగా, ఆయన సూటిగా సమాధానం ఇవ్వలేదు. మీరు కూటమి గురించి ఆలోచిస్తున్నారని, తను మాత్రం తమిళనాడు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైనే దృష్టి ఉందని చెప్పారు. ముఖ్యంగా చట్టవ్యవస్థ వైఫల్యం, మహిళల భద్రతపై ఆందోళన చెందుతున్నాని అన్నారు.టీవీకే స్థాపన సమయంలో విజయ్ తమ ప్రధాన రాజకీయ ప్రత్యర్థి డీఎంకే అని, సిద్ధాంతపరమైన ప్రత్యర్థి బీజేపీ అని స్పష్టం చేశారు. అయితే ఎన్డీఏ కూటమిలో చేరేందుకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మధ్యవర్తిత్వం చేసినట్లు వచ్చిన వార్తలు వచ్చాయి. దీంతో టీవీకే–ఎన్డీఏ కూటమి అవకాశంపై చర్చలు మళ్లీ తెరపైకి వచ్చాయి. టీవీకేను ఎన్డీఏలో చేర్చేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఆసక్తి చూపుతున్నారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో పార్టీ క్లారిటీ ఇవ్వడంతో పొత్తుపై స్పష్టత వచ్చింది.