• Other News
  • Live TV
  • వారిద్దరి కోసం బ్రిక్స్ అధ్యక్ష పదవి విలువను మోదీ తగ్గిస్తున్నారు: కాంగ్రెస్

    Reporter
    Journalist Chinna Telangana  |  March 16, 2026, 12:44 pm
    వారిద్దరి కోసం బ్రిక్స్ అధ్యక్ష పదవి విలువను మోదీ తగ్గిస్తున్నారు: కాంగ్రెస్

    బ్రిక్స్‌ కూటమికి అధ్యక్షత వహిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమాసియా వివాదంపై సమష్టి ప్రకటన విడుదల చేయకపోవడంపై కాంగ్రెస్ మండిపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రసన్నం చేసుకోవడానికి, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో తన స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగించాలనే కోరికతో నరేంద్ర మోదీ బ్రిక్స్ కూటమి అధ్యక్ష పదవి స్థాయిని తగ్గిస్తున్నారని ఆరోపించింది. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.

    "2026లో బ్రిక్స్ కూటమికి అధ్యక్షత వహిస్తామని భారత్ గొప్పలు చెప్పుకుంటోంది. కానీ ఇప్పటివరకు ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా చేసిన వైమానిక దాడులపై స్పందించలేదు. అలాగే గల్ఫ్ దేశాలలోని సైనికేతర లక్ష్యాలపై ఇరాన్ చేస్తున్న దాడులు, హిందూ మహాసముద్రంలో అమెరికా నేవీ ఇరాన్ నేవీకి చెందిన యుద్ధనౌకపై చేసి దాడిపై సమష్ఠి ప్రకటన విడుదల చేయడానికి భారత ప్రభుత్వం ధైర్యం చేయలేదు. యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను శాంతింపజేయడానికి, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో తన స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగించాలనే కోరికతో మోదీ బ్రిక్స్ అధ్యక్ష పదవి విలువ, హోదాను తగ్గిస్తున్నారు." అని జైరాం రమేశ్ పేర్కొన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow