• Other News
  • Live TV
  • పుదుచ్చేరిలోనూ మోగిన నగారా- 30 అసెంబ్లీ స్థానాలకు వచ్చే నెలలో ఎన్నికలు-

    Reporter
    Journalist Chinna Telangana  |  March 16, 2026, 12:47 pm
    పుదుచ్చేరిలోనూ మోగిన నగారా- 30 అసెంబ్లీ స్థానాలకు వచ్చే నెలలో ఎన్నికలు-

    కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోనూ పోల్ నగరా మోగింది. అక్కడి 30 అసెంబ్లీ స్థానాల్లో ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుంది. పుదుచ్చేరిలో వరుసగా మరోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో అధికార ఏఐఎన్‌ఆర్‌‌సీ- బీజేపీ కూటమి పావులు కదుపుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ లభించిన విజయాల విశ్వాసంతో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి ఎన్నికల బరిలోకి దూకుతోంది. ఆల్ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ (ఏఐఎన్‌ఆర్‌‌సీ) వ్యవస్థాపకుడు ఎన్. రంగసామి ప్రస్తుతం పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన 2001- 2008, 2011- 2016 కాలంలోనూ సీఎంగా పనిచేశారు. ప్రజల ముఖ్యమంత్రిగా పిలవబడే రంగసామి, విద్య, ఆరోగ్యం, పేదరిక నిర్మూలనపై దృష్టిసారిస్తారు.

    📰 e-Paper Clip
    Google News Follow