దేశంలో ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడిందని, త్వరలోనే గ్యాస్ సిలిండర్ ధర రూ.2,000 దాటుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ఈ ప్రచారానికి తెరదించేందుకు కేంద్రం కీలక ప్రకటన చేసింది. గృహ వినియోగదారులకు 100 శాతం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌లు అందుబాటులో ఉన్నాయని ఆ ప్రకటనలో పేర్కొన్నది. అన్ని రాష్ట్రాల్లోనూ ఎల్పీజీ స్టాక్ గృహావసరాలకు సరిపోయేంత ఉందని తెలిపింది.అదేవిధంగా పెట్రోల్, డీజిల్ కూడా తగినంతగా అందుబాటులో ఉందని కేంద్రం తెలిపింది. అన్ని చమురు శుద్ధి కర్మాగారాలు (రిఫైనరీలు) పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు వెల్లడించింది. పెట్రోల్, డీజిల్ కొరత లేదని స్పష్టంచేసింది. పర్షియన్ గల్ఫ్ నుంచి బయలుదేరిన శివాలిక్ ఎల్పీజీ క్యారియర్ హార్మూజ్ జలసంధిని దాటి భారతదేశం సమీపానికి చేరుకుందని వెల్లడించింది.యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో ఆగిపోయిన అన్ని భారత నౌకలు సురక్షితంగా ఉన్నాయని కేంద్రం తెలిపింది. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని పేర్కొంది. ప్రతి నౌకలోని సిబ్బందితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో 611 మందితో కూడిన 22 భారతీయ జెండా కలిగిన నౌకలు ఉన్నాయని తెలియజేసింది.
NATIONAL
గృహావసరాలకు సరిపడా ఎల్పీజీ గ్యాస్.. పెట్రోల్, డీజిల్‌కూ కొరత లేదు : కేంద్రం ప్రకటన
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
బంగ్లాదేశ్లో మరో దారుణం.. పూజలో ఉన్న హిందువులపై బాంబు దాడి
వీణా విద్వాంసురాలు శ్రీవాణిని కలిసిన న్యాయవాద దంపతులు
రూ.15 లక్షల లంచం ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ ఎస్ఈ