• Other News
  • Live TV
  • యుద్ధంలో తొలిసారి ‘డ్యాన్సింగ్‌ మిస్సైల్‌’ను వాడిన ఇరాన్‌..

    Reporter
    Journalist Chinna Telangana  |  March 16, 2026, 4:49 pm
    యుద్ధంలో తొలిసారి ‘డ్యాన్సింగ్‌ మిస్సైల్‌’ను వాడిన ఇరాన్‌..

    ఇజ్రాయెల్‌, అమెరికా (I) దాడులకు ప్రతిగా ఇరాన్‌ ( ప్రతిదాడులు కొనసాగిస్తోంది. ముఖ్యంగా గల్ఫ్‌ దేశాల () లోని అమెరికా స్థావరాలు, ఆస్తులే లక్ష్యంగా ఇరాన్‌ దాడులు చేస్తోంది. బహ్రెయిన్ (), సౌదీ అరేబియా (, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ () తదితర దేశాలపైకి భారీగా క్షిపణులు, డ్రోన్‌లను ప్రయోగిస్తున్నది.తాజాగా ఇజ్రాయెల్, యూఎస్ స్థావరాలే లక్ష్యంగా చేసిన దాడుల్లో ఇరాన్‌ అధునాతన క్షిపణులను ప్రయోగించింది. యుద్ధంలో తొలిసారిగా డ్యాన్సింగ్‌ మిస్సైల్‌గా పిలువబడే ‘సెజ్జిల్‌-2’ ని వినియోగించింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇరాన్‌ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ క్షిపణిని అషౌరా అనే పేరుతో కూడా పిలుస్తారు. సుదూరప్రాంతాల్లోని లక్ష్యాలను ఇది సమర్థంగా ధ్వంసం చేయగలదు.
    డ్యాన్సింగ్‌ మిస్సైల్‌ ప్రత్యేకత..!ఇరాన్‌ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ డ్యాన్సింగ్‌ మిసైల్ పరిధి 2,000 కిలోమీటర్లకు పైనే ఉంటుంది. ఏకంగా 700 కిలోల వార్‌ హెడ్‌లను మోసుకెళ్లగల సామర్థ్యం దీని సొంతం. అత్యధిక ఎత్తులో కూడా సమర్థంగా తిరుగుతూ లక్ష్యాన్ని ఢీకొడుతుంది. అందుకే దీన్ని డ్యాన్సింగ్‌ మిసైల్‌ అని పిలుస్తారు. ఐరన్‌ డోమ్‌ వంటి క్షిపణి రక్షణ వ్యవస్థలను తప్పించుకునేలా ఈ క్షిపణిని రూపొందించారు.
    సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (CSIS) ప్రకారం.. ఈ క్షిపణి దాదాపు 18 మీటర్ల పొడవు, 1.25 మీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది. దీని బరువు 23,600 కిలోగ్రాములు. ఈ క్షిపణుల రూపకల్పనను ఇరాన్‌ 1990లో ప్రారంభించింది. మొదటిసారిగా దీన్ని 2008లో పరీక్షించారు. ఆ సమయంలో ఈ క్షిపణి దాదాపు 800 కిలోమీటర్లు ప్రయాణించినట్లు తెలుస్తోంది.

    📰 e-Paper Clip
    Google News Follow