ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని సరిహద్దు జిల్లా పిథోర్‌గడ్‌లో ఉన్న లిపులేఖ్ కనుమను భారత్- చైనా సరిహద్దు వాణిజ్యం కోసం త్వరలో తెరవనున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత 2026లో ఈ సంప్రదాయ సరిహద్దు వాణిజ్యాన్ని పునర్ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ అంశంపై పిథోర్‌గడ్ జిల్లా కలెక్టర్ ఆశిశ్ కుమార్ భట్గైన్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాబోయే వాణిజ్య సీజన్ కోసం జరుగుతున్న సన్నాహాలను సమీక్షించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు భారత్-చైనా సరిహద్దు వాణిజ్యం కోసం కార్యాచరణ ప్రణాళికను అధికారులు ఖరారు చేస్తున్నారు.సరిహద్దు ప్రాంతాల ప్రజలకు ఈ వాణిజ్యం చాలా కీలకం
ఈ వాణిజ్యం కేవలం ఆర్థిక కార్యకలాపం మాత్రమే కాదని, సరిహద్దు ప్రాంతాల ప్రజల సామాజిక, సాంస్కృతిక జీవితంతో ఇది గాఢంగా ముడిపడి ఉందని అధికారులు తెలిపారు. భారత్- చైనాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం లిపులేఖ్ కనుమ ద్వారా వాణిజ్యం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు జరగాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే, హిమాలయ ప్రాంతంలోని కఠినమైన భూభాగం, వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ కాలపరిమితి మారే అవకాశం ఉందని వెల్లడించారు. అలాగే ఈ బోర్డర్ ట్రేడ్‌లో పాల్గొనే వ్యాపారులకు వాణిజ్య పాస్‌లు జారీ చేసే ఏర్పాట్లపై కూడా సమావేశంలో చర్చించామని స్పష్టం చేశారు. గతంలో మాదిరిగానే 2026లో కూడా వ్యాపారులకు వాణిజ్య పాస్‌లు జారీ చేస్తామని చెప్పారు. గతేడాది సుమారు 265 మంది వ్యాపారులకు పాస్‌లు మంజూరు చేశామని వివరించారు. వాణిజ్యాన్ని తిరిగి ప్రారంభించడం పట్ల పెరిగిన ఉత్సాహం కారణంగా ఈ ఏడాది దరఖాస్తుదారుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నామన్నారు.వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే, వాణిజ్య కాలాన్ని పొడిగించాలని పిథోర్‌గడ్ జిల్లా కలెక్టర్ ఆశిశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. తద్వారా ఎక్కువ మంది వ్యాపారులు లబ్ధి పొందగలరని, ఆర్థిక కార్యకలాపాలు ఎక్కువ కాలం కొనసాగగలవని ఆశిశ్ కుమార్ అభిప్రాయపడ్డారు. మరోవైపు, వాణిజ్య కార్యకలాపాలు సజావుగా సాగేలా చూసేందుకు బ్యాంకింగ్, కస్టమ్స్ ఏర్పాట్ల గురించి కూడా అధికారులు చర్చించారు. ధార్చులా ప్రాంతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నగదు, కరెన్సీ మార్పిడి సౌకర్యాలను అందిస్తుందని పిథోర్‌గడ్ జిల్లా అడిషనల్ కలెక్టర్ యోగేంద్ర సింగ్ తెలిపారు.
NATIONAL
భారత్, చైనా మధ్య సరిహద్దు వాణిజ్యం- తెరుచుకోనున్న లిపులేఖ్ పాస్
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
బంగ్లాదేశ్లో మరో దారుణం.. పూజలో ఉన్న హిందువులపై బాంబు దాడి
వీణా విద్వాంసురాలు శ్రీవాణిని కలిసిన న్యాయవాద దంపతులు
రూ.15 లక్షల లంచం ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ ఎస్ఈ