3,000 మంది ఉక్రెయిన్ పౌరులు భారతదేశంలోకి ప్రవేశించి, తిరుగుబాటు గ్రూపులకు శిక్షణ ఇచ్చేందుకు ఈశాన్య ప్రాంతంలో దాక్కున్నారని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఖండించింది. సోషల్ మీడియాలో వచ్చిన ఈ పోస్టులను నకిలీవని తేల్చింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
ఏడుగురిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
"3,000 మందికి పైగా ఉక్రేనియన్లు దేశంలోకి ప్రవేశించి, తిరుగుబాటు గ్రూపులకు శిక్షణ ఇచ్చేందుకు ఈశాన్య ప్రాంతంలో దాక్కున్నారని కొన్ని సోషల్ మీడియా పోస్టులు కనిపించాయి. వీరికి అమెరికా కిరాయి సైనికుల మద్దతు ఉందని, ఉగ్రవాదులకు చౌకగా డ్రోన్లను సరఫరా చేస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వచ్చాయి. ఈ వార్తలన్నీ ఫేక్. మిజోరం మీదుగా మయన్మార్‌లోకి అక్రమంగా ప్రవేశించిన ఏడుగురిని (ఆరుగురు ఉక్రేనియన్లు, ఒక అమెరికన్) ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఇమ్మిగ్రేషన్, భద్రతా సంస్థలు పూర్తి అప్రమత్తంగా ఉన్నాయి. ఈ చొరబాట్లపై దర్యాప్తు కొనసాగుతోంది" అని కేంద్రం ప్రకటనలో పేర్కొంది.
అమెరికాకు చెందిన కీలక వ్యక్తి అరెస్ట్
ఎన్ఐఏ అరెస్టు చేసిన ఏడుగురిలో అమెరికాకు చెందిన అంతర్జాతీయ భద్రతా విశ్లేషకుడు మాథ్యూ ఆరోన్ వాన్‌డైక్ కూడా ఉన్నాడు. అతడిని కోల్‌కతా విమానాశ్రయంలో ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. మాథ్యూ ఆరోన్ వాన్‌డైక్ మిలిటరీ కాంట్రాక్ట్ కంపెనీ సన్స్ ఆఫ్ లిబర్టీ ఇంటర్నేషనల్ (SOLI)ని స్థాపించాడు. తాను లిబియా విప్లవంలో పాల్గొన్నానని మాథ్యూ చెప్పాడు. ఆ సమయంలో పట్టుబడి జైలు శిక్ష అనుభవించానని వెల్లడించాడు. మాథ్యూ స్వస్థలం అమెరికాలోని మేరీలాండ్. తాను అంతర్జాతీయ వ్యాపారవేత్త, సైనికుడు, వార్ కరస్పాండెంట్, కాలమిస్ట్ అని తన వెబ్‌సైట్‌లో పేర్కొనడం గమనార్హం.
NATIONAL
'భారత్‌లోకి 3,000 మంది ఉక్రేనియన్లు'- ఆ వార్తలపై కేంద్రం క్లారిటీ
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
బంగ్లాదేశ్‌లో మరో దారుణం.. పూజలో ఉన్న హిందువులపై బాంబు దాడి
వీణా విద్వాంసురాలు శ్రీవాణిని కలిసిన న్యాయవాద దంపతులు
రూ.15 లక్షల లంచం ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ ఎస్ఈ