కేరళ : పశ్చిమాసియా ఉద్రిక్తతలతో దేశంలో పెరుగుతున్న వంటగ్యాస్ ధరలు, కుదేలవుతున్న చిన్న తరహా పరిశ్రమలు, అంతర్జాతీయ వేదికపై భారత విదేశాంగ విధానంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం ప్రస్తుతం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిలో ఉందని కేరళ సీఎం పినరయి విజయన్ ఆరోపించారు. సొంత వ్యూహాత్మక నిర్ణయాల కోసం అమెరికా ఆమోదం కోసం భారత్ వేచి చూసే పరిస్థితి దాపురించిందని దుయ్యబట్టారు. ఇది భారత సార్వభౌమాధికారానికి పెను ముప్పుగా ఆయన అభివర్ణించారు.
కేంద్ర ప్రభుత్వం అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకుంటోందని, దీనివల్ల అంతర్జాతీయ స్థాయిలో భారత్ తన స్వతంత్రతను కోల్పోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం కన్నూర్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడిన ఆయన, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ధ్వజమెత్తారు. కేంద్రం దేశ సార్వభౌమాధికారాన్ని అమెరికా వద్ద తాకట్టు పెండుతోందని మండిపడ్డారు.
వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు ఆకాశాన్ని తాకడం వల్ల హోటల్ రంగం, చిన్నతరహా పరిశ్రమలు, తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయన్నారు. కేంద్రం కావాలనే ధరలను పెంచుతూ చిన్న వ్యాపారాలను మూతపడేలా చేస్తోందన్నారు. వీటిని ప్రజా వ్యతిరేక నిర్ణయాలుగా ఆయన అభివర్ణించారు. కేంద్రం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వెనుక కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలే దాగి ఉన్నాయని, సామాన్య ప్రజల క్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆయన ఆరోపించారు.వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు ఆకాశాన్ని తాకడం వల్ల హోటల్ రంగం, చిన్నతరహా పరిశ్రమలు, తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయన్నారు. కేంద్రం కావాలనే ధరలను పెంచుతూ చిన్న వ్యాపారాలను మూతపడేలా చేస్తోందన్నారు. వీటిని ప్రజా వ్యతిరేక నిర్ణయాలుగా ఆయన అభివర్ణించారు. కేంద్రం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వెనుక కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలే దాగి ఉన్నాయని, సామాన్య ప్రజల క్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆయన ఆరోపించారు.ముడి చమురు రవాణాలో అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ దాదాపుగా మూసివేసింది. దీని వల్ల భారత్‌తో సహా అనేక దేశాలకు చమురు సరఫరా మందగించింది. ఈ సంక్షోభాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతోందని, తద్వారా భారతీయులపై ఆర్థిక భారం పెరుగుతోందని పినరయి విజయన్ విమర్శించారు.
NATIONAL
సొంత నిర్ణయాలు తీసుకునే స్థితిలో భారత్ లేదు, అంతా అమెరికా చేతిలోనే- కేరళ సీఎం పినరయి విజయన్
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
బంగ్లాదేశ్‌లో మరో దారుణం.. పూజలో ఉన్న హిందువులపై బాంబు దాడి
వీణా విద్వాంసురాలు శ్రీవాణిని కలిసిన న్యాయవాద దంపతులు
రూ.15 లక్షల లంచం ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ ఎస్ఈ