• Other News
  • Live TV
  • దేశీయ విమానయాన సంస్థల సమ్మర్ షెడ్యూల్ రిలీజ్ చేసిన డీజీసీఏ

    Reporter
    Journalist Chinna Telangana  |  March 23, 2026, 12:11 pm
    దేశీయ విమానయాన సంస్థల సమ్మర్ షెడ్యూల్ రిలీజ్ చేసిన డీజీసీఏ

    న్యూఢిల్లీ,: దేశీయ విమానయాన సంస్థల వేసవి విమాన సర్వీసుల షెడ్యూల్‌ను డైరెక్టరేట్ జనరల్ ఫర్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విడుదల చేసింది. ప్రయాణికులు సంబంధిత విమానయాన సంస్థల వెబ్‌సైట్‌ను సరిచూసుకోవాలని సూచించింది. అలాగే కార్యాచరణ అత్యవసర పరిస్థితుల కారణంగా చివరి నిమిషంలో విమాన షెడ్యూల్‌లో మార్పులు జరిగితే ఆయా విమానయాన సంస్థలను సంప్రదించాలని కోరింది. ఈ మేరకు మార్చి 29 నుంచి అక్టోబర్ 24 వరకు వర్తించే దేశీయ విమాన సర్వీసుల సమ్మర్ షెడ్యూల్‌ను సోమవారం రిలీజ్ చేసింది.విమాన ఛార్జీలపై పరిమితులు ఎత్తివేతదేశీయ విమాన ఛార్జీలపై విధించిన తాత్కాలిక పరిమితులను ఎత్తివేస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ ఆదివారం ప్రకటించింది. ఈ నిర్ణయం మార్చి 23 (సోమవారం) నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. గతేడాది డిసెంబర్‌లో ఇండిగో సంక్షోభం కారణంగా ప్రభుత్వం విధించిన ఈ పరిమితులను తొలగిస్తున్నట్లు పేర్కొంది. విమాన టికెట్ల ధరలపై పరిమితులు ఇకపై అవసరం లేదని తెలియజేస్తూ కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఓ ఉత్తర్వును ఆదివారం జారీ చేసింది. కాగా, ఈ నిర్ణయం మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా విమాన టికెట్ ధరలను నిర్ణయించుకోవడానికి విమానయాన సంస్థలకు అనుమతిస్తుంది.
    "ఇండిగో విమాన సర్వీసులకు భారీ స్థాయిలో అంతరాయం కలగడం వల్ల టికెట్ల ధరలలో తలెత్తే అసాధారణ పెరుగుదలను అరికట్టేందుకు గతేడాది డిసెంబరు 6న విమాన ఛార్జీలపై తాత్కాలిక పరిమితులు విధించాం. ప్రయాణీకుల ప్రయోజనాలను కాపాడడానికి, విమాన టికెట్లు అందుబాటులో ఉండేలా చూసేందుకు ఆ నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుతం విమానసంస్థల కార్యకలాపాలు సద్దుమణిగాయి. అందుకే గతేడాది డిసెంబర్‌లో విధించిన ఛార్జీల పరిమితిని 2026 మార్చి 23 నుంచి ఉపసంహరించుకుంటున్నాం." అని కేంద్ర పౌర విమానయాన శాఖ పేర్కొంది.

    📰 e-Paper Clip
    Google News Follow