• Other News
  • Live TV
  • బ‌హ్రెయిన్ పేలుడుకు డ్రోన్ కార‌ణం కాదు.. పాట్రియాట్ మిస్సైల్ విఫ‌లం వ‌ల్లే ఆ ఘ‌ట‌న‌

    Reporter
    Journalist Chinna Telangana  |  March 23, 2026, 12:15 pm
    బ‌హ్రెయిన్ పేలుడుకు డ్రోన్ కార‌ణం కాదు.. పాట్రియాట్ మిస్సైల్ విఫ‌లం వ‌ల్లే ఆ ఘ‌ట‌న‌

    దుబాయ్‌: ఇరాన్ రిలీజ్ చేస్తున్న షాహిద్ డ్రోన్లు గ‌ల్ఫ్ దేశాల్లో తీవ్ర న‌ష్టాన్ని క‌లిగిస్తున్న విష‌యం తెలిసిందే. మార్చి 9వ తేదీన బ‌హ్రెయిన్‌లో ఓ పేలుడు ఘ‌ట‌న జ‌రిగింది. ఆ అటాక్‌లో సుమారు 32 మంది గాయ‌ప‌డ్డారు. అనేక ఇండ్లు ధ్వంసం అయ్యాయి. ఆ పేలుడుకు ఇరాన్ డ్రోన్ కార‌ణం తొలుత భావించారు. కానీ తాజా రిపోర్టు ప్ర‌కారం ఆ పేలుడుకు పాట్రియాట్ ఇంట‌ర్‌సెప్టార్ మిస్సైల్ కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. పాట్రియాట్‌ క్షిప‌ణి వ్య‌వ‌స్థ‌కు చెందిన బ్యాట‌రీ విఫ‌లం కావ‌డం వ‌ల్ల ఆ పేలుడు జ‌రిగిన‌ట్లు మిడిల్‌బ‌రీ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్ట‌డీస్ ప‌రిశోధ‌కులు వెల్ల‌డించారు.
    రాజ‌ధాని మ‌నామాకు స‌మీపంలో ఉన్న సిత్రా దీవిలోని మ‌హ‌జ్జా ప్రాంతంలో మార్చి 9వ తేదీన పేలుడు జ‌రిగింది. పేలుడు ఘ‌ట‌న జ‌రిగిన ప్రాంతానికి 7 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న పాట్రియాట్ బ్యాట‌రీ నుంచి ఆ మిస్సైల్ వ‌చ్చిన‌ట్లు స్ట‌డీలో గుర్తించారు. పాట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ బ్యాట‌రీ ఫైర్ చేసిన ఇంట‌ర్‌సెప్టార్ మిస్సైల్ విఫ‌లం కావ‌డం వ‌ల్ల బ‌హ్రెయిన్‌లో పేలుడు జ‌రిగిన‌ట్లు నిర్ధార‌ణ‌కు వ‌చ్చ‌రు. అయితే ఇరాన్ డ్రోన్ వ‌ల్లే మ‌హ‌జ్జా ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు బెహ్ర‌యిన్ కానీ వాషింగ్ట‌న్ కానీ ఆధారాలు చూపించ‌లేదు.త‌క్కువ ధ‌ర క‌లిగిన షాహిద్ డ్రోన్ల‌ను అడ్డుకునేందుకు ఖ‌రీదు ఎక్కువైన మిస్సైల్ వ్య‌వ‌స్థ‌ను ఈ వార్‌లో వాడుతున్న‌ట్లు ఇప్ప‌టికే ఆరోప‌ణ‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. వాస్త‌వానికి పాట్రియాట్ క్షిప‌ణి వ్య‌వ‌స్థ నుంచి రిలీజైన ఇంట‌ర్‌సెప్టార్ నిజానికి డ్రోన్‌ను అడ్డుకుందో లేదో తెలియ‌దు కానీ దాని వ‌ల్ల పెను విధ్వంసం జ‌రిగిన‌ట్లు నివేదిక‌లు వెల్ల‌డించాయి.

    📰 e-Paper Clip
    Google News Follow