• Other News
  • Live TV
  • టెక్సాస్ ఆయిల్ రిఫైన‌రీలో భారీ పేలుడు.

    Reporter
    Journalist Chinna Telangana  |  March 24, 2026, 5:13 pm
    టెక్సాస్ ఆయిల్ రిఫైన‌రీలో భారీ పేలుడు.

    టెక్సాస్: అమెరికాలోని ఓ ఆయిల్ రిఫైన‌రీ)లో భారీ పేలుడు సంభ‌వించింది. టెక్సాస్‌లోని పోర్ట్ ఆర్థ‌ర్‌లో ఉన్న వ‌లెరో రిఫైన‌రీలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. భారీ ఎత్తును మంట‌లు వ్యాపించాయి. ద‌ట్ట‌మైన న‌ల్ల‌టి పొగ ఆ ప్రాంతాన్ని క‌మ్ముకున్న‌ది. పేలుడు స‌మ‌యంలో భారీ శ‌బ్ధం వ‌చ్చిన‌ట్లు స్థానికులు చెప్పారు. కొన్ని మైళ్ల దూరం వ‌ర‌కు భూమి కంపించిన‌ట్లు వెల్ల‌డించారు. పోర్ట్ ఆర్థ‌ర్‌లో అప్ర‌మ‌త్త‌త ప్ర‌క‌టించారు. ఈ ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ వారి గురించి ఇంకా ఎటువంటి స‌మాచారం లేద‌ని జెఫ‌ర్‌స‌న్ కౌంటీ ష‌రీఫ్ జీనా స్టీఫెన్స్ తెలిపారు.

    ఏ కార‌ణం చేత పేలుడు జరిగిందో ఇంకా నిర్ధారించ‌లేక‌పోయిన‌ట్లు పోర్ట్ ఆర్థ‌ర్ ఫైర్ డిపార్ట‌మెంట్ చీఫ్ ఆంటోనియో మిచెల్ పేర్కొన్నారు. టెక్సాస్ గల్ఫ్ కోస్టులో ఉన్న రిఫైన‌రీల్లో వ‌లెరో అతిపెద్ద‌ది. ఇక్క‌డ ప్ర‌తి రోజు సుమారు నాలుగున్న‌ర ల‌క్ష‌ల బ్యారెళ్ల క్రూయిడ్ ఆయిల్‌ను రిఫైన్ చేస్తారు. ఇరాన్‌పై దాడి వ‌ల్ల ప్ర‌స్తుతం అమెరికాలో ఇంధ‌న ధ‌ర‌లు ఆకాశాన్ని అంటాయి. ఇక పోర్ట్ ఆర్థ‌ర్ రిఫైన‌రీ పేలుడు ఘ‌ట‌న‌తో ప‌రిస్థితి మ‌రింత తీవ్రం కానున్న‌ట్లు భావిస్తున్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow