Deprecated: ltrim(): Passing null to parameter #1 ($string) of type string is deprecated in /home/u229881858/domains/vaarthapatrika.com/public_html/single.php on line 57
VAARTHA PATRIKA
  • Other News
  • Live TV
  • మనది మోదీ వ్యక్తిగత విదేశాంగ విధానంగా మారిపోయింది- అదో యూనివర్సల్ జోక్​: రాహుల్ గాంధీ

    Reporter
    Journalist Chinna Telangana  |  March 24, 2026, 5:15 pm

    పశ్చిమాసియా సంక్షోభం గురించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. మన విదేశాంగ విధానం ప్రధాని మోదీ వ్యక్తిగత విదేశాంగ విధానంగా మారిపోయిందని దుయ్యబట్టారు. అంతర్జాతీయ స్థాయిలో ఇదొక హాస్యాస్పదమైన అంశంగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ భవన ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక, ఇరాన్ వర్సెస్ అమెరికా, ఇజ్రాయెల్​ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు పాకిస్థాన్ ఒక మధ్యవర్తిగా ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో రాహుల్, మోదీ సర్కార్​పై విమర్శల వర్షం కురిపించారు.
    "మన దేశ విదేశాంగ విధానం ప్రధాని మోదీ వ్యక్తిగత విదేశాంగ విధానంగా మారిపోయింది. దీన్ని అందరూ ఓ యూనివర్సల్ జోక్​లా భావిస్తున్నారు. మోదీ ఏం చేయగలరో, ఏం చేయలేరో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​నకు కచ్చితంగా తెలుసు. ప్రధాని రాజీపడితే, మన విదేశాంగ విధానం కూడా రాజీపడినట్లే. ఆయన నిన్న పార్లమెంట్​లో ఏమాత్రం సంబంధం లేని ప్రసంగం చేశారు. వాస్తవానికి ఆయన భారత ప్రధానిగా అనిపించాలి. కానీ ప్రస్తుతం ఆయన ఆ పొజిషన్​లో లేరు. దీని వల్ల ప్రజలు బాధపడాల్సి వస్తోంది. 'ఎల్​పీజీ, పెట్రోల్ ధరలు పెరగడం ఆరంభం మాత్రమే, పరిస్థితి కొవిడ్​ లాగా ఉంటుందని' మోదీ అంటున్నారు. కానీ కరోనా సమయంలో ఎంత మంది చనిపోయారో, ఎన్ని విషాధాలు జరిగాయో ఆయన మర్చిపోయారు."
    - రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ, లోక్​సభలో ప్రతిపక్ష నేత
    ఆ చర్చలో పాల్గొనలేను!
    కేరళలో తనకు ఒక కార్యక్రమం ఉన్నందున, పశ్చిమాసియా ఉద్రిక్తతలపై బుధవారం జరిగే అఖిలపక్ష సమావేశంలో తాను పాల్గొనలేనని రాహుల్ గాంధీ తెలిపారు. "మమ్మల్ని వారు అఖిలపక్ష సమావేశానికి పిలిచారు. అందులో చర్చ జరగాలి. కానీ వాళ్లు ఒక నిర్మాణాత్మకమైన తప్పు చేశారు. వ్యవస్థను నాశనం చేశారు. దానిని సరిదిద్దలేం. ప్రధాని మోదీ కూడా అది చేయలేరు. నేను మీకు రాతపూర్వకంగా ఒక విషయం చెప్పగలను. మోదీ భారతదేశం గురించి, భారత రైతుల ప్రయోజనాల కోసం పనిచేయరు. ఆయన అమెరికా, ఇజ్రాయెల్​ చెప్పిందే చేస్తారు" అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
    మనల్ని రక్షించడానికి మోదీ సిద్ధంగా ఉన్నారా?
    పశ్చిమాసియా యుద్ధ ప్రభావాలు మన దేశంపై పడే అవకాశం ఉందని, అందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని పార్లమెంట్​లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మండిపడ్డారు. యుద్ధ ప్రభావం నుంచి తప్పించుకోవడానికి మనం సిద్ధపడాల్సింది పోయి, ఆ బాధ్యతను కేంద్రం బయటివారికి అప్పగించిందని, పదేపదే హెచ్చరికలు చేసినా, తగు చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆయన ఎక్స్ వేదికగా ఆరోపించారు. ఎల్​పీజీ సిలిండర్ల నిరంతర సరఫరా, గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తమిళులను రక్షించడం, విద్యుత్ కేంద్రాలకు గ్యాస్​ సరఫరా కేటాయింపు పరిమితులను పెంచడం మొదలైనవాటిని కోరుతూ మార్చి 11న తాను ప్రధాని మోదీకి ఓ లేఖ రాసిన విషయాన్ని స్టాలిన్ గుర్తు చేశారు.

    📰 e-Paper Clip
    Google News Follow