• Other News
  • Live TV
  • బందర్‌ అబ్బాస్‌ తీరంలో ఇజ్రాయెల్‌ దాడి.. ఇరాన్‌ నేవీ కమాండర్‌ మృతి

    Reporter
    Journalist Chinna Telangana  |  March 26, 2026, 5:03 pm
    బందర్‌ అబ్బాస్‌ తీరంలో ఇజ్రాయెల్‌ దాడి.. ఇరాన్‌ నేవీ కమాండర్‌ మృతి

    పశ్చిమాసియా ( ) లో ఇరాన్‌ (), ఇజ్రాయెల్‌ () దేశాల మధ్య యుద్ధం తీవ్రతరమవుతోంది. ఈ క్రమంలో ఇవాళ ఇరాన్‌కు మరో దెబ్బ తగిలింది. బందర్ అబ్బాస్ () తీరప్రాంతంలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ () నౌకాదళ కమాండర్ అలీ రెజా తంగ్సిరి () మరణించారు. ఈ మేరకు ఇజ్రాయెల్ అధికారిని ఉటంకిస్తూ ఆ దేశ మీడియా నివేదిక సమర్పించింది.

    కాగా ఇరాన్‌తో యుద్ధానికి ఐదు రోజులపాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విరామం ప్రకటించారు. చర్చల ఫలితాలను బట్టి తదుపరి నిర్ణయం ఉంటుందని మూడు రోజుల క్రితం ప్రకటించారు. అయితే ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం మాత్రం కొనసాగుతున్నది. ఈ క్రమంలో హర్మూజ్ జలసంధికి సమీపంలోని బందర్ అబ్బాస్ ప్రాంతంలో ఇజ్రాయెల్ దాడి జరిపింది. ఈ దాడిలో ఇరాన్‌ నేవీ కమాండర్‌ అలీ రెజా మృతి చెందారని తెలుస్తోంది.

    అలీ రెజా తంగ్సిరి 2018 నుంచి నౌకాదళ కమాండర్‌గా ఉంటున్నారు. ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేయడంలో రెజా కీలకపాత్ర పోషించినట్లు భావిస్తున్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow