• Other News
  • Live TV
  • ఎయిర్ ఇండియా లండన్ విమానం.. సౌదీ గగనతలంలో యూ టర్న్‌

    Reporter
    Journalist Chinna Telangana  |  March 26, 2026, 5:04 pm
    ఎయిర్ ఇండియా లండన్ విమానం.. సౌదీ గగనతలంలో యూ టర్న్‌

    న్యూఢిల్లీ: లండన్‌కు బయలుదేరిన ఎయిర్‌ ఇండియా విమానం మార్గమధ్యలో యూటర్న్‌ తీసుకున్నది. సాంకేతిక లోపం కారణంగా సౌదీ గగనతలంలో వెనక్కి మళ్లింది. ఏడు గంటలు ప్రయాణించిన ఆ విమానం తిరిగి ఢిల్లీకి చేరుకున్నది. (Air India London flight U-turn) ఎయిర్ ఇండియాకు చెందిన ఏ350 విమానం (ఏఐ 111) లండన్‌లోని హీత్రూ విమానాశ్రయానికి వెళ్లేందుకు గురువారం ఉదయం 6.13 గంటలకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ నుంచి టేకాఫ్‌ అయ్యింది. సుమారు మూడు గంటల పాటు 3,300 కిలోమీటర్లు గాలిలో ప్రయాణించింది.

    కాగా, ఇరాన్ యుద్ధం కారణంగా ప్రభావితమైన సౌదీ అరేబియా గగనతలంపై ఉన్న ఎయిర్‌ ఇండియా విమానం మరో ఏడు గంటలు ప్రయాణించి లండన్‌ చేరుకోవాల్సి ఉన్నది. అయితే అనూహ్యంగా అది వెనక్కి మళ్లింది. విమానంలో సాంకేతిక సమస్యల కారణంగా గాలిలో యూ టర్న్ తీసుకున్నది. మరో మూడున్నర నుంచి నాలుగు గంటలపాటు వెనక్కి ప్రయాణించింది. మొత్తం ఏడు గంటల ప్రయాణం తర్వాత గురువారం మధ్యాహ్నం 1.20 గంటలకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో తిరిగి ల్యాండ్ అయింది.

    మరోవైపు సౌదీ అరేబియా గగనతలంపై ప్రయాణిస్తున్న సమయంలో విమానంలో పెద్ద శబ్దాలు వినిపించినట్లు ఎయిర్‌ ఇండియా తెలిపింది. దీంతో యూ టర్న్‌ తీసుకుని వెనక్కి వచ్చినట్లు పేర్కొంది. అనుకోని పరిస్థితి కారణంగా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేసింది. వీలైనంత త్వరలో ప్రయాణికులు లండన్‌ చేరుకునేలా అన్ని విధాలా కృషి చేస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఢిల్లీకి తిరిగి రావడానికి ఎయిర్‌ ఇండియా విమానం సుదీర్ఘ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నదో అన్నది తెలియలేదు.

    📰 e-Paper Clip
    Google News Follow