• Other News
  • Live TV
  • మెడికల్​ కాలేజీలో అగ్నిప్రమాదం- 27మంది నవజాత శిశువులను కాపాడిన డాక్టర్

    Reporter
    Journalist Chinna Telangana  |  March 28, 2026, 4:41 pm
    మెడికల్​ కాలేజీలో అగ్నిప్రమాదం- 27మంది నవజాత శిశువులను కాపాడిన డాక్టర్

    మధ్యప్రదేశ్​ :మధ్యప్రదేశ్​లోని ఓ మెడికల్ కాలేజీ అతి పెద్ద ప్రమాదం తప్పింది. నవజాత శిశువుల వార్డులో షార్ట్​ సర్య్కూట్​ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. అదే సమయంలో డ్యూటీలో ఉన్న వైద్యుడి సకాలంలో స్పందించి మంటలను ఆర్పివేయడం వల్ల 27 మంది శిశువులు సురక్షితంగా బయటపడ్డారు.

    అసలేం జరిగిదంటే?
    జబల్​పుర్​లోని నేతాజీ సుభాష్ చంద్ర బోస్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో గురువారం అర్ధరాత్రి సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. నవజాత శిశువుల ఇంటెన్నివ్ కేర్ యూనిట్ (ఎన్​ఐసీయూ) వద్ద ఉన్న వెయింటింగ్ ఏరియాలోని ఫ్యాన్​లో షార్ట్​ సర్య్కూట్​ కారణంగా మంటలు చెలరేగాయి. మొదట దట్టంగా పొగ వచ్చింది. కాసేపటికే అది ఎన్​ఐసీయూ వార్డులోకి వ్యాపించింది. దీంతో ఆస్పత్రిలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది.

    27 మంది శిశువులు ప్రమాదంలో
    అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో ఎన్​ఐసీయూ వార్డులో 27 మంది నవజాత శిశువులు చికిత్స పొందుతున్నారు. దీంతో వారి తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొందరు వార్డులోకి పరుగెత్తి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పొగను గమనించిన డ్యూటీలో ఉన్న డాక్టర్ వెంటనే స్పందించి ఫైర్​ ఎక్స్​టింగ్విషర్​తో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అలాగే సిబ్బంది వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసి, మంటలు మరింత వ్యాపించకుండా అడ్డుకున్నారు. 27 మంది శిశువులను వెంటనే మరో వార్డుకు తరలించారు. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత ఎన్​ఐసీయూలో చేర్చారు.

    ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరవింద్ శర్మ స్పందించారు. ఫ్యాన్ నుంచి పొగ రావడం ప్రారంభమైన వెంటనే డ్యూటీలో ఉన్న డాక్టర్ ఫైర్ ఎక్స్​టింగ్విషర్​తో మంటలను ఆర్పివేసినట్లు చెప్పారు.

    📰 e-Paper Clip
    Google News Follow