ఎమ్మెల్సీ పదవికి బిహార్ సీఎం నీతీశ్ కుమార్ రాజీనామా చేయడంపై ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ స్పందించారు. భారతీయ జనతా పార్టీ బిహార్ ప్రజలను, నీతీశ్ కుమార్‌ను మోసం చేసిందని ఆరోపించారు. ఈ క్రమంలో నీతీశ్ కుమార్‌ను మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందేతో పోల్చారు. ఈ మేరకు తేజస్వీ ఓ వార్తా సంస్థతో వ్యాఖ్యానించారు."ఎన్నికల తర్వాత నీతీశ్ కుమార్ బిహార్ ముఖ్యమంత్రిగా కొనసాగరని మేము మొదటి నుంచీ చెబుతూనే ఉన్నాం. మహారాష్ట్రలోలాగే (ఏక్‌నాథ్ శిందే సీఎం పదవీ కాలాన్ని ఉద్దేశించి) కొద్ది కాలం పాటు ముఖ్యమంత్రిగా నీతీశ్‌ను కొనసాగనిచ్చారు. ఇప్పుడు నీతీశ్‌ను సీఎం పదవి నుంచి బీజేపీ తొలగిస్తోంది. నీతీశ్ కుమార్‌ను, బిహార్ ప్రజానీకాన్ని బీజేపీ మోసం చేసింది. కమలం పార్టీ మాటలకు, చేతలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది" అని తేజస్వీ యాదవ్ పేర్కొన్నారు.
NATIONAL
నీతీశ్‌ను, బిహార్ ప్రజలను బీజేపీ మోసం చేసింది: తేజస్వీ యాదవ్
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
బంగ్లాదేశ్‌లో మరో దారుణం.. పూజలో ఉన్న హిందువులపై బాంబు దాడి
వీణా విద్వాంసురాలు శ్రీవాణిని కలిసిన న్యాయవాద దంపతులు
రూ.15 లక్షల లంచం ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ ఎస్ఈ