• Other News
  • Live TV
  • తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు : నామినేషన్లు దాఖలు చేసిన స్టాలిన్​, విజయ్​

    Reporter
    Journalist Chinna Telangana  |  March 30, 2026, 4:31 pm
    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు : నామినేషన్లు దాఖలు చేసిన స్టాలిన్​, విజయ్​

    తమిళనాడు ముఖ్యమంత్రి, DMK అధినేత MK స్టాలిన్ చెన్నైలోని కొళత్తూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు. నామ పత్రాలు దాఖలు చేసే సమయంలో ఆయన వెంట పార్టీ కీలక నేతలు ఉన్నారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత స్టాలిన్ రోడ్ షో నిర్వహించారు. ప్రజలకు అభివాదం చేస్తూ తనను మళ్లీ ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా కొళత్తూర్‌లో చేపట్టిన అభివృద్ధి పనులపై ఒక పుస్తకాన్ని విడుదల చేశారు.

    ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తన సొంత నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు ముఖ్యమంత్రి స్టాలిన్​. ఒకవైపు పరిపాలన వ్యవహారాలు చూస్తూనే, మరోవైపు పార్టీని గెలిపించే బాధ్యతను భుజాన వేసుకున్నారు. అయితే, కొళత్తూర్‌ నుంచి స్టాలిన్ నామినేషన్ వేయడం ఇది నాలుగోసారి. గతంలో మూడు సార్లు ఈ నియోజకవర్గం నుంచి బరిలో దిగి ఘన విజయం సాధించారు ముఖ్యమంత్రి స్టాలిన్​. నామినేషన్​ అనంతరం మాట్లాడిన స్టాలిన్, కొళత్తూర్‌ ప్రజలు తనకు వరుసగా నాలుగోసారి అఖండ విజయాన్ని అందిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకు భారీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇదివరకు జరిగిన ఎన్నికలతో పోలిస్తే తమకు ఈ సారి ప్రజల్లో అపారమైన మద్దతు కనిపిస్తోందని స్టాలిన్​ పేర్కొన్నారు. 'ఈసారి విజయం చాలా గొప్పగా ఉంటుంది. దిల్లీకి తమిళనాడు ఎదురు నిలుస్తుంది' అని స్టాలిన్ వ్యాఖ్యానించారు.

    📰 e-Paper Clip
    Google News Follow