• Other News
  • Live TV
  • ఆస్పత్రి నుంచి సోనియాగాంధీ డిశ్ఛార్జ్‌

    Reporter
    admin March 31, 2026, 5:18 pm
    ఆస్పత్రి నుంచి సోనియాగాంధీ డిశ్ఛార్జ్‌

    కాంగ్రెస్‌ అగ్రనేత్రి సోనియాగాంధీ వారంరోజుల తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్‌ అయ్యారు. ఈ మేరకు దిల్లీలోని సర్‌ గంగారామ్ ఆస్పత్రి వైద్యులు ఓ ప్రకటన చేశారు. ఈనెల 24న రాత్రి పదిన్నర గంటలప్రాంతంలో జ్వరంతో ఆస్పత్రిలో చేరిన సోనియా ఏడు రోజులపాటు చికిత్స పొందారు. ప్రస్తుతం సోనియా కోలుకోవడంతో డిశార్చ్ చేశారు.

    గత మార్చి 24 రాత్రి 10:30 గటంల సమయంలో జ్వరంతో సోనియా గాంధీ సర్​ గంగా రామ్ ఆసుపత్రిలో చేరారు. వైద్యుల బృందం సమగ్ర పరీక్షలు నిర్వహించగా, ఆమెకు సిస్టమిక్ ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లు నిర్ధరించారు. అనంతరం యాంటీబయాటిక్స్‌తో చికిత్స ఇవ్వడం ప్రారంభించారు. సోనియా గాంధీ అనారోగ్యానికి వాతావరణ మార్పులు, దిల్లీ కాలుష్యం ప్రధాన కారణమని వైద్యులు వెల్లడించారు. ఛాతీలో బిగుతు, స్వల్ప శ్వాసకోశ సమస్యలతో సోనియా ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో వైద్యులు పర్యవేక్షణలో ఉంచారు.

    📰 e-Paper Clip
    Google News Follow