• Other News
  • Live TV
  • సీబీఎస్‌ఈలో కీలక మార్పు.. ఇకపై మూడు భాషల విధానం తప్పనిసరి

    Reporter
    Journalist Chinna Telangana  |  April 3, 2026, 4:02 pm
    సీబీఎస్‌ఈలో కీలక మార్పు.. ఇకపై మూడు భాషల విధానం తప్పనిసరి

    ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) విద్యా విధానంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మూడు భాషల విధానాన్ని అమలు చేయబోతుంది. 2031 నాటికి పదో తరగతిలో కూడా మూడు భాషల విధానం అమలయ్యేలా ఈ మార్పు చేపట్టింది. అయితే, ఒకేసారి 2031లో అమలు చేయడం కాకుండా, ఇందుకోసం ఇప్పటినుంచే త్రిభాషా విధానాన్ని అమలు చేయబోతుంది.

    ఈ విద్యా సంవత్సరం నుంచి ఆరో తరగతిలో మూడు భాషల విధానం అమలవుతుంది. 2026-27కు సంబంధించి, ఆరో తరగతికి, 2027-28లో ఏడో తరగతికి, 2028-29లో ఎనిమిదో తరగతికి, 2029-30 నాటికి తొమ్మిదో తరగతికి, 2031-31 నాటికి పదో తరగతికి మూడు భాషల విధానాన్ని అమలు చేయలని సీబీఎస్‌ఈ నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆరో తరగతి చదివే వారు మూడు భాషలు చదవాల్సి ఉంటుంది. ఇకపై పదో తరగతి వరకు ప్రతిఏటా ఇలాగే ఈ విధానం అమలవుతుంది. ప్రస్తుతం సీబీఎస్‌ఈలో రెండు భాషల విధానమే అమలవుతున్న సంగతి తెలిసిందే. ఇంగ్లీష్‌తోపాటు మరో ప్రాంతీయ భాషను మాత్రమే అమలు చేస్తున్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్‌ఈపీ) 2020లో వచ్చిన సూచనలకు అనుగుణంగా ఈ మార్పు తీసుకొచ్చింది సీబీఎస్‌ఈ బోర్డు. బహుభాషా విధానం వల్ల ఉపయోగం ఉంటుందనేది దీని ఉద్దేశం. భారతీయ భాషలకు ఆదరణ కూడా పెరుగుతుందని ప్రభుత్వం కూడా విశ్వసిస్తోంది.

    📰 e-Paper Clip
    Google News Follow