కళ్యాణదుర్గం, వార్తాపత్రిక ప్రతినిధి
రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లి భౌతిక దాడులకు పాల్పడిన గీతం కాలేజ్ నిర్వాహకురాలు మనీషా నాయర్‌తో పాటు ఆమె అనుచరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని కళ్యాణదుర్గం రిపోర్టర్స్ డిమాండ్ చేశారు.
జర్నలిస్ట్ లక్ష్మీనారాయణపై జరిగిన దాడిని ఖండిస్తూ సోమవారం కళ్యాణదుర్గం డీఎస్పీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాజంలోజరుగుతున్న అక్రమాలు,అన్యాయాలు,అవినీతి,ఆరోపణలను ప్రజల ముందుకు తీసుకురావడం పాత్రికేయుల విధి ధర్మమని పేర్కొన్నారు.
వార్తపై అభ్యంతరాలు ఉంటే చట్టపరంగా కోర్టును ఆశ్రయించి న్యాయం కోరవచ్చని, కానీ గుండాగిరి చేస్తూ ఇంటికి వెళ్లి భౌతిక దాడులకు పాల్పడటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్ట్‌ను అవమానించేలా కాళ్లు మొక్కించుకుని పైశాచిక ఆనందం పొందడం సమాజం తలదించుకునే ఘటనగా అభివర్ణించారు.ఇటీవలి కాలంలో దళితులపై, జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్నాయని, సామాన్య ప్రజలకు రక్షణ కరువవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.ఈ కార్యక్రమంలో డి. నరేష్ కుమార్, కె. రాజేష్, బండి సుధా, మల్లికార్జున, అస్లం, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు
ANDHRA PRADESH
రిపోర్టర్ లక్ష్మీనారాయణపై దాడి చేసిన మనీషా నాయర్‌ను అరెస్ట్ చేయాలి
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఏసీబీ అధికారులకు చిక్కిన పేట RDO రాంచందర్ నాయక్
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రసాయన శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎం.డి. ఖాజా ఆరిఫ్ కి, రసాయన శాస్త్రంలో పి.హెచ్.డి. పట్టా
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
దోస్త్ మిల్గయా పోరాట యోధునికి ములుగు జిల్లా స్వాగతం సుస్వాగతం పలుకుతోంది